యూట్యూబ్ స్టార్‌కు చేదు అనుభవం!
వాషింగ్టన్: యూట్యూబ్ స్టార్‌కు ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో స్థిరపడ్డ యెమెన్ వాసి అడమ్ సాలేను అరబిక్‌లో మాట్లాడినందుకు డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానం నుంచి దించేసింది. దీనిపై అతడు తన అసహనాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బుధవారం ఉదయం లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చాడు.
విమానంలో కూర్చున్న అడమ్ సాలే ఫోన్‌లో తన తల్లి, ఫ్రెండ్స్‌తో అరబిక్ భాషలో మాట్లాడాడు. తోటి ప్రయాణికులు ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు వచ్చి విమానం దిగాల్సిందిగా తనను కోరినట్లు వీడియోలో తెలిపాడు. కారణం అడిగితే తాను ఏదో అర్థంకాని భాషలో మాట్లాడానని, దానివల్ల వారికి అసౌకర్యానికి లోనవుతున్నట్లు ఫిర్యాదు చేశారని ఎయిర్ లైన్స్ సిబ్బంది తెలిపారు. జాత్యహంకారంతోనే తనను అవమానించారని సాలే అవేదనం వ్యక్తంచేశాడు.
ఇప్పటికే యూట్యూబ్ లో 2.2 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్న సాలే ఇందుకు సంబంధించిన తతంగాన్ని వీడియో తీసి.. #BoycottDelta అనే ట్యాగ్ తో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఒక్కరోజులోనే ఈ వీడియో తో ఉన్న ట్వీట్ 2 లక్షల మంది రీట్వీట్ చేశారు. ఎయిర్ లైన్స్ అధికారులను సంప్రదించగా.. 20 మంది ప్యాసెంజర్స్ అసౌకర్యానికి లోనవుతున్నట్లు ఫిర్యాదు చేసిన కారణంగా ఇద్దరు వ్యక్తులను ఫ్లైట్ నుంచి దించివేసినట్లు వివరణ ఇచ్చారు. ఆన్ లైన్లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.