న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో గురిపెట్టి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాలనుకున్న భారత షూటర్లకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) షాకిచ్చింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ షూటర్లకు ప్రభుత్వం వీసాలు నిరాకరించడంతో భారత్ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్ షూటింగ్‌లో ఒలింపిక్స్ కోటాను రద్దు చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) అధ్యక్షుడు వ్లాదిమిర్ లిసిన్ గురువారం వెల్లడించారు.
‘ఢిల్లీ ఈవెంట్‌లో ఒలింపిక్స్ కోటా రద్దు చేసినట్లు ఐఓసీ తెలిపింది. క్రీడల్లో వివక్షకు తావులేదని చెప్పింది. ఇక్కడ కేటాయించిన 16 ఒలింపిక్స్ బెర్తుల్ని మరో ప్రపంచకప్‌కు తరలించింది. ఐఓసీలో భాగమైన మేం కమిటీ ఆదేశాలను పాటించక తప్పదు’ అని లిసిన్ తెలిపారు. మరోవైపు భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు రణీందర్ సింగ్ మాత్రం తాము ఇంకా ఐఓసీ తుది నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment