అయోనికాకు కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజూ భారత షూటర్ల గురి అదిరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అయోనికా పాల్ కాంస్య పతకం సాధించగా... అయోనికా పాల్, అపూర్వీ చండీలా, పూజా ఘాట్కర్‌లతో కూడిన భారత జట్టుకు టీమ్ ఈవెంట్‌లో (1241.4 పాయింట్లు) రజత పతకం లభించింది. వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి అయోనికా, అపూర్వీ, పూజా ఫైనల్‌కు చేరుకోగా... అయోనికా 185 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
అపూర్వీ ఎనిమిదో స్థానంతో, పూజా ఐదో స్థానంతో సంతృప్తి పడ్డారు. యూత్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆశి రస్తోగి స్వర్ణం, ప్రాచీ గడ్కరీ కాంస్యం నెగ్గగా... జూనియర్ విభాగంలో శ్రీయాంక సాదంగి కాంస్య పతకం సొంతం చేసుకుంది.