జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్‌లో మూడో రోజూ భారత షూటర్లు ఐదు పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ నాన్సీ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... ఇలవేనిల్ వలారివన్ రజత పతకం దక్కించుకుంది. నాన్సీ, ఇలవేనిల్, మెహులీ ఘోష్‌లతో కూడిన భారత జట్టు 1897.2 పాయింట్లతో టీమ్ విభాగంలో బంగారు పతకం నెగ్గింది.
వ్యక్తిగత ఫైనల్లో నాన్సీ 252.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇలవేనిల్ 252.7 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందింది. చైనా షూటర్ షెన్ యుఫాన్ 231.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకం సాధించగా... రుద్రాంక్ష్ , అర్జున్ బబూటా, శ్రీకార్తీక్‌లతో కూడిన భారత బృందానికి కాంస్య పతకం దక్కింది.
వ్యక్తిగత ఫైనల్లో రుద్రాం„Š 228.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని పొందాడు. టీమ్ విభాగంలో రుద్రాం„Š , అర్జున్, శ్రీకార్తీక్ బృందం 1885.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment