Air Rifle
-
భారత షూటర్లకు ఐదు పతకాలు
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో మూడో రోజూ భారత షూటర్లు ఐదు పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ నాన్సీ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... ఇలవేనిల్ వలారివన్ రజత పతకం దక్కించుకుంది. నాన్సీ, ఇలవేనిల్, మెహులీ ఘోష్‌లతో కూడిన భారత జట్టు 1897.2 పాయింట్లతో టీమ్ విభాగంలో బంగారు పతకం నెగ్గింది. వ్యక్తిగత ఫైనల్లో నాన్సీ 252.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇలవేనిల్ 252.7 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందింది. చైనా షూటర్ షెన్ యుఫాన్ 231.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకం సాధించగా... రుద్రాంక్ష్ , అర్జున్ బబూటా, శ్రీకార్తీక్లతో కూడిన భారత బృందానికి కాంస్య పతకం దక్కింది. వ్యక్తిగత ఫైనల్లో రుద్రాం„Š 228.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని పొందాడు. టీమ్ విభాగంలో రుద్రాం„Š , అర్జున్, శ్రీకార్తీక్ బృందం 1885.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. -
Asian Games 2023: ‘పసిడి’ బుల్లెట్...
హాంగ్జౌ: తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ షూటర్లు ఆసియా క్రీడల్లో తమ గురికి పదును పెట్టారు. పోటీల రెండో రోజు భారత షూటర్లు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు అందించారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రుద్రాంశ్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంశ్ సింగ్ పన్వర్‌లతో కూడిన భారత జట్టు 1893.7 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కొత్త ప్రపంచ రికార్డును నెలకొలి్పంది. ఈ ఏడాది ఆగస్టు 23న చైనా జట్టు 1893.3 పాయిం్లటతో సాధించిన ప్రపంచ రికార్డును భారత త్రయం తిరగరాసింది. క్వాలిఫయింగ్‌లో ఆయా దేశాల షూటర్లు చేసిన స్కోరును లెక్కించి టాప్–3లో నిలిచిన జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. క్వాలిఫయింగ్‌లో భారత్ నుంచి రుద్రాంశ్ 632.5 పాయింట్లు, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 631.6 పాయింట్లు, దివ్యాంశ్ 629.6 పాయింట్లు సాధించారు. టాప్–8లో నిలిచిన ఈ ముగ్గురూ ఫైనల్‌కు అర్హత సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు షూటర్లకు మాత్రమే ఫైనల్లో ఆడేందుకు అనుమతి ఉంది. దాంతో దివ్యాంశ్ కంటే ఎక్కువ పాయింట్లు స్కోరు చేసిన రుద్రాంశ్ , ఐశ్వరీ ప్రతాప్ భారత్ తరఫున ఫైనల్లో పోటీపడ్డారు. ఎనిమిది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంశ్ 208.7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలువగా... ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 228.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. లిహావో షింగ్ (చైనా; 253.3 పాయింట్లు) కొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని ౖకైవసం చేసుకోగా... హాజున్ పార్క్ (దక్షిణ కొరియా; 251.3 పాయింట్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్‌వీర్ సిద్ధూ (582 పాయింట్లు), ఆదర్శ్ సింగ్ (576 పాయింట్లు), అనీశ్ (560 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. భారత త్రయం మొత్తం 1718 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇండోనేసియా కూడా 1718 పాయింట్లు సాధించినా... 10 పాయింట్ల షాట్లు భారత్‌కంటే (45) ఇండోనేసియా (37) తక్కువగా కొట్టడంతో టీమిండియాకు కాంస్యం ఖరారైంది. క్వాలిఫయింగ్‌లో విజయ్‌వీర్ సిద్ధూ ఆరో ర్యాంక్‌లో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయ్‌వీర్ 21 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో కాంస్య పతకానికి దూరమయ్యాడు. కాంస్య పతకాలతో ఆదర్శ్, విజయ్‌వీర్, అనీశ్ -
రుద్రాంక్ష్ పసిడి గురి
కైరో (ఈజిప్ట్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక కాంస్యం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ పసిడి పతకం సాధించగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో తిలోత్తమ సేన్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో రుద్రాంక్ష్ 16–8తో మాక్సిమిలన్ ఉల్బ్రిచ్ (జర్మనీ)పై గెలిచాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ర్యాంకింగ్ రౌండ్లో రుద్రాంక్ష్ 262 పాయింట్లు, ఉల్బ్రిచ్ 260.6 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించారు. మిరాన్ మారిసిచ్ (క్రొయేషియా; 260.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. 74 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్ 629.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ర్యాంకింగ్ రౌండ్‌కు చేరాడు. టాప్–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్ రౌండ్లో పోటీపడతారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ర్యాంకింగ్ రౌండ్లో తిలోత్తమ సేన్ 262 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. ప్రస్తుతం భారత్ 3 స్వర్ణాలు, 2 కాంస్యాలతో కలిపి ఐదు పతకాలతో టాప్ ర్యాంక్‌లో ఉంది. -
World Shooting Championship: భారత షూటర్ల జోరు
కైరో: ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో రమిత 16–12తో చైనా షూటర్ యింగ్ షెన్‌పై గెలుపొందింది. జూనియర్ మహిళల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు దివ్యాంశి (547 పాయింట్లు) స్వర్ణం, వర్షా సింగ్ (539 పాయింట్లు) రజతం, టియానా (523 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ మొత్తం 25 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
Shooting World Cup: ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అర్జున్, పార్థ్
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇద్దరు భారత షూటర్లు అర్జున్ బబూటా, పార్థ్ మఖీజా ఫైనల్లోకి దూసుకెళ్లి పతకాలపై గురి పెట్టారు. దక్షిణ కొరియాలోని చాంగ్వాన్ నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. 53 మంది షూటర్ల మధ్య ఆదివారం నిర్వహించిన క్వాలిఫయింగ్‌లో అర్జున్ 630.5 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో, పార్థ్ 628.4 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచారు. టాప్–8లో నిలిచిన వారి మధ్య నేడు ఫైనల్ జరగనుంది. -
Junior World Cup: మనోళ్ల గురి అదిరింది
సాక్షి, హైదరాబాద్/విజయవాడ స్పోర్ట్స్: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో శుక్రవారం టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ యువ షూటర్ మద్దినేని ఉమామహేశ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో ఉమామహేశ్, పార్థ్, రుద్రాం„Š లతో కూడిన భారత జట్టు 16–8తో స్పెయిన్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. విజయవాడకు చెందిన 17 ఏళ్ల ఉమామహేశ్ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో ఇషా సింగ్, పలక్, మనూ భాకర్‌లతో కూడిన భారత జట్టు 16–8తో జార్జియా జట్టుపై గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో రమిత, జీనా ఖిట్టా, ఆర్యా బోర్సెలతో కూడిన భారత జట్టు 17–9తో దక్షిణ కొరియా జట్టును ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో సౌరభ్ చౌదరీ, శివ, సరబ్జీత్లతో కూడిన భారత జట్టు 17–9తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి నాలుగో పసిడి పతకాన్ని అందించింది. -
Tokyo Paralympics: అవని అద్వితీయం
దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత మహిళా టీనేజ్ షూటర్ అవనీ లేఖరా అద్భుతాన్ని ఆవిష్కరించింది గత సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ –1 విభాగంలో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల ఈ రాజస్తానీ షూటర్ శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఎస్‌హెచ్–1 ఈవెంట్లో కాంస్యం సాధించింది. తద్వారా పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మరోవైపు హర్వీందర్ సింగ్ కాంస్యం రూపంలో ఆర్చరీలో భారత్ తొలి పతకం నెగ్గగా... అథ్లెట్ ప్రవీణ్ కుమార్ హైజంప్‌లో రజతం సాధించాడు. దాంతో శుక్రవారం భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. బ్యాడ్మింటన్‌లో కనీసం రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఓవరాల్‌గా భారత్ 2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో 37వ స్థానంలో ఉంది. టోక్యో: దివ్యాంగుల విశ్వ క్రీడల్లో శుక్రవారం భారత క్రీడాకారులు మెరిశారు. ఏకంగా మూడు పతకాలు గెలిచి మురిపించారు. మహిళల షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో 19 ఏళ్ల అవనీ లేఖరా కాంస్య పతకం నెగ్గింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల అవని 445.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. 16 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అవని 1176 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో అవనికిది రెండో పతకం. గత సోమవారం అవని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని గుర్తింపు పొందింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్ అవని. 1984 పారాలింపిక్స్‌లో జోగిందర్ సింగ్ మూడు పతకాలు గెలిచాడు. ఆయన షాట్‌పుట్‌లో రజతం, జావెలిన్ త్రోలో కాంస్యం, డిస్కస్ త్రోలో కాంస్యం సాధించాడు. ‘షూట్ ఆఫ్’లో సూపర్... టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ నిరాశపరిచినా... టోక్యో పారాలింపిక్స్‌లో మాత్రం హరీ్వందర్ సింగ్ అద్భుతం చేశాడు. విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన పురుషుల రికర్వ్ ఓపెన్ వ్యక్తిగత విభాగంలో హరియాణాకు చెందిన 31 ఏళ్ల హరీ్వందర్ కాంస్య పతకం గెలిచాడు. కాంస్యం గెలిచే క్రమంలో హరీ్వందర్ మూడు ‘షూట్ ఆఫ్’లను దాటడం విశేషం. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సుతో జరిగిన కాంస్య పతక పోరులో హర్వీందర్ ‘షూట్ ఆఫ్’లో 10–8తో నెగ్గాడు. అంతకుముందు ఇద్దరు 5–5తో సమఉజ్జీగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... హర్వీందర్ 10 పాయింట్ల షాట్ కొట్టాడు. కిమ్ మిన్ సు 8 పాయింట్ల షాట్‌తో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు తొలి రౌండ్లో హరీ్వందర్ సింగ్ ‘షూట్ ఆఫ్’లో 10–7తో స్టెఫానో ట్రావిసాని (ఇటలీ)పై... ప్రిక్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లోనే 8–7తో బాటో టిసిడెన్డోర్జియెవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో హరీ్వందర్ 6–2తో మైక్ జార్జెవ్స్కీ (జర్మనీ)పై నెగ్గాడు. అయితే సెమీఫైనల్లో హరీ్వందర్ 4–6తో కెవిన్ మాథెర్ (అమెరికా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచాడు. భారత్‌కే చెందిన మరో ఆర్చర్ వివేక్ చికారా ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–7తో డేవిడ్ ఫిలిప్స్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. పొలంలో సాధన చేసి... హరియాణాలోని కైథాల్ జిల్లాలోని గుహ్లా చీకా గ్రామానికి చెందిన హరీ్వందర్ ప్రస్తుతం పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేస్తున్నాడు. అతనికి ఏడాదిన్నర వయసు ఉండగా డెంగ్యూ బారిన పడ్డాడు. ఆ సమయంలో స్థానిక డాక్టర్ ఒకరు హర్వీందర్‌కు ఇచి్చన ఇంజెక్షన్ విక టించింది. దాంతో హరీ్వందర్ కాళ్లలో సరైన కదలిక లేకుండా పోయింది. గత ఏడాది కరోనా లాక్డౌన్ కారణంగా హరీ్వందర్ ప్రాక్టీస్‌కు దూరమై తన గ్రామంలో ఉండిపోవాల్సి వచి్చంది. ఈ దశలో హరీ్వందర్కు ఓ ఆలోచన తట్టింది. అప్పటికే పంటను కోయడంతో ఖాళీగా ఉన్న తమ పొలంలోనే ఆర్చరీ రేంజ్‌ను ఏర్పాటు చేసుకొని హర్వీందర్ రోజూ రెండుసార్లు సాధన చేశాడు. అతని సాధనకు పారాలింపిక్స్‌లో పతకం రూపంలో ఫలితం వచ్చింది. ప్రవీణ్... ఆసియా రికార్డు... రజతం... పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి64 కేటగిరీలో పాల్గొన్న 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. రెండేళ్ల క్రితమే ఈ ఆటలో అడుగుపెట్టిన ప్రవీణ్ 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ఆసియా రికార్డు సృష్టించడంతోపాటు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బరిలోకి దిగిన తొలిసారే పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని ప్రవీణ్ అన్నాడు. జొనాథన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ (బ్రిటన్–2.10 మీటర్లు) స్వర్ణం సాధించగా... లెపియాటో (పోలాండ్–2.04 మీటర్లు) కాంస్యం గెలిచాడు. మహిళల ఎఫ్–51 డిస్కస్ త్రో విభాగంలో భారత్‌కు చెందిన కశిష్ లాక్రా (12.66 మీటర్లు) ఆరో స్థానంలో, ఏక్తా (8.38 మీటర్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల షాట్‌ఫుట్ ఎఫ్–56 విభాగం ఫైనల్లో భారత్‌కు చెందిన సోమన్ రాణా (13.81 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు ఖాయం పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో భారత ప్లేయర్లు సుహాస్ యతిరాజ్, తరుణ్... ఎస్ఎల్–3 విభాగంలో ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. తద్వారా భారత్‌కు కనీసం రెండు పతకాలను ఖాయం చేశారు. -
పతకాల సంఖ్య పెరుగుతుంది
ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. ఇది నా ప్రయాణంలోని ఎన్నో జ్ఞాపకాలను కళ్ల ముందుంచింది. మొదటిసారి 2004లో ఏథెన్స్కు వెళ్లినప్పుడు ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చిన చిన్నా పిల్లాడిలా నేను కనిపించాను. నాలుగేళ్ల తర్వాత బీజింగ్‌లో ఒక్క పాయింట్ తేడాతో ఎయిర్ రైఫిల్ ఫైనల్ అవకాశం చేజారడంతో నా గుండె పగిలింది. 2012 లండన్‌లో కాంస్యం పతకం గెలవడం ఆ బాధను మరిచేలా చేస్తే 2016లో పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఒక అభిమానిగా మొదలు పెట్టి ఆటగాడిగా, ఆపై పతక విజేతగా, ఇప్పుడు ఇతరులకు మార్గదర్శిగా ఈ క్రీడలో నాకు ఎదురైన అన్ని సవాళ్లను ఇష్టంగానే ఎదుర్కొన్నాను. ఎయిర్ రైఫిల్ షూటర్ ఎలవెనిల్ వలరివన్‌లోని ప్రతిభను తొలిసారి అహ్మదాబాద్‌లోని సంస్కార్‌ధామ్‌లో నా అకాడమీ గన్ ఫర్ గ్లోరీ గుర్తించిన తర్వాత ఆమె వరల్డ్ నంబర్‌వన్‌గా మారే వరకు మార్గనిర్దేశనం వహించడం సంతోషంగా అనిపిస్తుంది. షూటింగ్ చాలా ఖరీదైన క్రీడ. ఇదే కారణంగా కొన్నిసార్లు అపార ప్రతిభ కూడా కనిపించకుండా మరుగున పడిపోతుంది. దాగి ఉన్న వజ్రాలను వెతికి ఆపై సానబెట్టి వారిని జాతీయ శిబిరం వరకు చేర్చడమే మా లక్ష్యం. ఈ క్రమంలో ఎంతో బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నాం. ప్రతిభ గలవారు దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా, అన్ని అడ్డంకులను అధిగమించే విధంగా అథ్లెట్లకు సహకారం అందిస్తున్నాం. అత్యుత్తమ ప్రతిభ దారి తప్పకుండా ఒక సరైన వ్యవస్థను తీర్చిదిద్దే పనిలో మనం ఉన్నాం. ఈ క్రమంలో ఖేలో ఇండియా గేమ్స్, స్కాలర్షిప్లు, గుర్తింపు పొందిన అకాడమీలు కీలకంగా పని చేస్తున్నాయి. ప్రతిభ గల అథ్లెట్లు ముందుగా టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) స్కీమ్ డెవలప్మెంట్ గ్రూప్‌లో అవకాశం దక్కించుకొని ఆపై మెరుగైన ప్రదర్శనతో ‘టాప్స్’ కోర్ గ్రూప్‌లోకి వస్తారు. భారత్‌కు సంబంధించి టోక్యో ఒలింపిక్స్ ఇప్పటికే ప్రత్యేకంగా మారాయి. గతంతో పోలిస్తే ఎక్కువ క్రీడాంశాల్లో, ఎక్కువ మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. నాకు తెలిసి తమ కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అనేక మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఎంతో మంది అండగా నిలవడమే ఇందుకు కారణం. గతంలోని సంఖ్యను అధిగమించేలా భారత్ ఈసారి ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించగలదని ఆశించడంలో తప్పు లేదు. క్రీడల్లో ఉండే అనిశ్చితి గురించి నాకు బాగా తెలుసు. అయితే మన ఆటగాళ్ల సన్నద్ధతకు అవసరమైన అన్ని రకాల అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాం కాబట్టి వాటి ప్రతిఫలం దక్కుతుందని భావిస్తున్నా. -
ఇలవేనిల్ పసిడి గురి
న్యూఢిల్లీ: షేక్ రసెల్ అంతర్జాతీయ ఎయిర్ రైఫిల్ ఆన్లైన్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మెరిశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ప్రపంచ నంబర్‌వన్ ఇలవేనిల్ వలరివన్ పసిడి పతకం నెగ్గగా... పురుషుల విభాగంలో తుషార్ మానే రజతం దక్కించుకున్నాడు. ఇలవేనిల్ 627.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 1000 డాలర్ల (రూ. 73 వేలు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. షియోరి హిరాట (జపాన్) రెండో స్థానంలో... విద్య తోయిబా (ఇండోనేసియా) మూడో స్థానంలో నిలిచారు. పురుషుల విభాగంలో జపాన్ షూటర్ నయోయ ఒకాడ 630.9 పాయింట్లతో బంగారు పతకాన్ని గెల్చుకోగా... తుషార్ 623.8 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని పొందాడు. తుషార్‌కు 700 డాలర్లు (రూ. 51 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అబ్దుల్లా (బంగ్లాదేశ్) మూడో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరిగింది. -
ప్రపంచ నంబర్‌వన్ అపూర్వీ
న్యూఢిల్లీ: కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న భారత మహిళా షూటర్ అపూర్వీ చండేలా మరో మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అపూర్వీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అపూర్వీ 1926 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన మరో రైఫిల్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ 1695 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉంది. గత ఫిబ్రవరిలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో అపూర్వీ 252.9 పాయింట్ల స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన ఈ రాజస్తాన్ షూటర్... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం కైవసం చేసుకుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న అపూర్వీ ఇటీవల బీజింగ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత యువ షూటర్ దివ్యాన్‡్ష సింగ్ పన్వర్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ వర్మ 16వ స్థానం నుంచి మూడో ర్యాంక్‌కు చేరుకోగా... సౌరభ్ నాలుగో ర్యాంక్ నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు. పురుషుల ట్రాప్ విభాగం ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్ 24వ ర్యాంక్ నుంచి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
ఎయిర్ రైఫిల్ షూటింగ్ అకాడమీ ప్రారంభం
కర్నూలు (టౌన్): స్థానిక వెంకటరమణ కాలనీలో ఎయిర్ రైఫిల్ షూటింగ్ అకాడమీని ఆదివారం ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా రైఫిల్ షూటింగ్ సంఘం కార్యదర్శి బాషా ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి మహానగరాలకు పరిమితమైన రైఫిల్ షూటింగ్‌ను కర్నూలులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు అకాడమీ సేవలను వినియోగించుకోవాలన్నారు. -
భారత షూటర్లకు నిరాశ
మ్యూనిచ్: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ టోర్నమెంట్లో తొలి రోజు భారత షూటర్లకు నిరాశ మిగిలింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా, చెయిన్ సింగ్... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అయోనికా పాల్, పూజా ఘాట్కర్ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. అభినవ్ బింద్రా 626.2 పాయింట్లతో 15వ స్థానంలో, చెయిన్ సింగ్ 622.8 పాయింట్లతో 41వ స్థానంలో నిలిచారు. పూజా 417.4 పాయింట్లతో 13వ, అయోనిక 417.2 పాయింట్లతో 16వ స్థానంతో సంతృప్తి పడ్డారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్, ప్రకాశ్ నంజప్ప, ఓంకార్ సింగ్ క్వాలిఫయింగ్ రౌండ్‌కు అర్హత సాధించారు. -
రియో ఒలింపిక్స్‌కు బింద్రా అర్హత
న్యూఢిల్లీ : ఒలింపిక్స్‌లో భారత్ తరఫున వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణం సాధించిన ఏకైక షూటర్ అభినవ్ బింద్రా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా ఆరో స్థానంలో నిలవడం ద్వారా రియో బెర్త్ దక్కించుకున్నాడు. భారత్ నుంచి ఇప్పటికే షూటింగ్లో గగన్ నారంగ్, జీతూ రాయ్, అపూర్వి చండిలా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. బింద్రా ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఈసారితో ఐదోసారి అవుతుంది. -
అభినవ్ బింద్రా విఫలం
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ గ్రనాడా (స్పెయిన్): కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన విభాగంలో భారత మేటి షూటర్ అభినవ్ బింద్రా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిరాశపరిచాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో... బింద్రా ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో బింద్రా 624.8 పాయింట్లు స్కోరు చేసి 15వ స్థానంలో నిలిచాడు. టాప్-8లో నిలిచినవారే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఇదే విభాగంలో భారత షూటర్లు సంజీవ్ రాజ్‌పుత్ 624.2 పాయింట్లతో 20వ స్థానంలో, రవి కుమార్ 616.2 పాయింట్లతో 78వ స్థానంలో నిలిచారు. పురుషుల ట్రాప్ ఈవెంట్లో రెండు రౌండ్ల తర్వాత మానవ్‌జిత్ సంధూ 50 పాయింట్లతో మరో 11 మందితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ 46 పాయింట్లతో 93వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ విభాగంలో మరో మూడు రౌండ్లు ఉన్నాయి.