ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్
గ్రనాడా (స్పెయిన్): కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన విభాగంలో భారత మేటి షూటర్ అభినవ్ బింద్రా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిరాశపరిచాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో... బింద్రా ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో బింద్రా 624.8 పాయింట్లు స్కోరు చేసి 15వ స్థానంలో నిలిచాడు. టాప్-8లో నిలిచినవారే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
ఇదే విభాగంలో భారత షూటర్లు సంజీవ్ రాజ్‌పుత్ 624.2 పాయింట్లతో 20వ స్థానంలో, రవి కుమార్ 616.2 పాయింట్లతో 78వ స్థానంలో నిలిచారు. పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో రెండు రౌండ్ల తర్వాత మానవ్‌జిత్ సంధూ 50 పాయింట్లతో మరో 11 మందితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ 46 పాయింట్లతో 93వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ విభాగంలో మరో మూడు రౌండ్లు ఉన్నాయి.
అభినవ్ బింద్రా విఫలం
Published Tue, Sep 9 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement
Advertisement