world shooting championship
-
భారత్ బంగారు గురి
బకూ (అజర్బైజాన్): ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం భారత షూటర్లు అద్వితీయ ప్రదర్శనతో అలరించారు. రెండు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకం సాధించడంతోపాటు భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ ఐదో బెర్త్‌ను ఖరారు చేశారు. తెలంగాణ షూటర్ ఇషా సింగ్, హరియాణా అమ్మాయిలు రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ బృందం మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు బంగారు పతకం అందించింది. రిథమ్, ఇషా సింగ్, మనూ భాకర్ జట్టు 1,744 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో రిథమ్ 583 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇషా సింగ్ 581 పాయింట్లతో 16వ స్థానంలో, మనూ 580 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రిథమ్ ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో అఖిల్ షెరాన్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం మొత్తం 1750 పాయింట్లు స్కోరు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 585 పాయింట్లు స్కోరు చేసిన అఖిల్ ఐదో స్థానంతో ఫైనల్‌కు అర్హత పొందాడు. ఎనిమిది మంది మధ్య షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అఖిల్ 450 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. అంతేకాకుండా భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ ఐదో బెర్త్‌ను అందించాడు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో మూడో స్థానంలో ఉంది. అనాహత్ అదరహో డాలియన్ (చైనా): భారత స్క్వాష్ రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించింది. 15 ఏళ్ల అనాహత్ ఫైనల్లో 3–1తో ఇనా క్వాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. ఈ టోరీ్నలో భారత్‌కు మూడు కాంస్య పతకాలు కూడా లభించాయి. అండర్–19 బాలుర సింగిల్స్‌లో శౌర్య, అండర్–19 బాలికల సింగిల్స్‌లో పూజ ఆర్తి, అండర్–15 బాలుర సింగిల్స్‌లో ఆర్యవీర్ సింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. చాంపియన్ వృత్తి అగర్వాల్ భువనేశ్వర్: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 14 పతకాలతో మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ టోరీ్నలో తెలంగాణ స్విమ్మర్లు ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలు గెలిచారు. హైదరాబాద్ అమ్మాయి వృత్తి అగర్వాల్ గ్రూప్–1 బాలికల విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించింది. వృత్తి ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. చివరిరోజు శివాని కర్రా 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్స్‌లో తెలంగాణకు రెండు రజత పతకాలు అందించింది. గచి్చ»ౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద శివాని శిక్షణ తీసుకుంటోంది. నిత్యశ్రీ సాగి రెండు రజతాలు, ఒక కాంస్యం, సుహాస్ ప్రీతమ్ రెండు కాంస్యాలు నెగ్గారు. -
ఇషా–శివ జోడీకి స్వర్ణం
బకూ (అజర్బైజాన్): ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్ –శివా నర్వాల్ జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన ఇషా సింగ్... హరి యాణాకు చెందిన శివా నర్వాల్ ఫైనల్లో 16–10తో తర్హాన్ ఇలేదా–యూసుఫ్ డికెచ్ (తుర్కియే) ద్వయంపై విజయం సాధించారు. ఫైనల్‌ను మొత్తం 13 రౌండ్లపాటు నిర్వహించారు. ఒక్కో రౌండ్లో ఇరు జట్ల షూటర్లు రెండేసి షాట్లు లక్ష్యం దిశగా సంధిస్తారు. అత్యధిక పాయింట్లు సాధించిన జోడీకి రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. భారత జోడీ ఎనిమిది రౌండ్లలో నెగ్గగా, తుర్కియే జంట ఐదు రౌండ్లలో గెలిచింది. అంతకుముందు 65 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో ఇషా సింగ్–శివా నర్వాల్ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో... తర్హాన్–యూసుఫ్ జోడీ 581 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాయి. 580 పాయింట్లతో జియాంగ్ రాన్‌జిన్–జాంగ్ బౌవెన్ (చైనా), హనియె–సాజద్ (ఇరాన్) జంటలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందాయి. కాంస్య పతక మ్యాచ్‌లో రాన్‌జిన్–జాంగ్ బౌవెన్ ద్వయం 17–7తో హనియె–సాజద్ జంటను ఓడించింది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీలకు నిరాశ ఎదురైంది. మెహులీ–ఐశ్వరీ ప్రతాప్ సింగ్ జోడీ 630.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... రమిత –దివ్యాంశ్ జంట 628.3 పాయింట్లు సాధించి 17వ స్థానంలో నిలిచాయి. టాప్–4లో నిలిచిన జోడీలు మాత్రమే స్వర్ణ, రజత, కాంస్య పతకాల మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో పరీనాజ్ ధలివాల్, గనీమత్ సెఖోన్, దర్శన రాథోడ్ బృందం 351 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. 8 ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ గెలిచిన స్వర్ణ పతకాలు. గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్‌జిత్ సింగ్ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), రుద్రాం„Š (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రుద్రాం„Š , అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్ బృందం (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్) ఈ ఘనత సాధించారు. -
పసిడి పతకాలతో ముగింపు
చాంగ్వాన్ (కొరియా): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలను భారత షూటర్లు పసిడి పతకాలతో ముగించారు. ఈ టోర్నీ చివరిరోజు సోమవారం భారత్‌కు మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం లభించాయి. పురుషుల 50 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కమల్జీత్ 544 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. కమల్జీత్, అంకిత్ తోమర్, సందీప్ బిష్ణోయ్‌లతో కూడిన భారత జట్టు 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో 1617 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. మహిళల 50 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో టియానా 519 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. టియానా, యశిత షోకీన్, వీర్పాల్ కౌర్‌లతో కూడిన భారత జట్టు మహిళల 50 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో 1498 పాయింట్లతో బంగారు పతకాన్ని గెల్చుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత షూటర్లు ఓవరాల్‌గా ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 17 పతకాలతో రెండో స్థానంలో నిలిచారు. 28 పతకాలతో చైనా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. -
Shooting C’ships 2023: ధనుశ్ శ్రీకాంత్ జట్టుకు స్వర్ణం, ఆంధ్ర షూటర్‌కు కాంస్యం
చాంగ్వాన్ (కొరియా): గురి తప్పని ప్రదర్శనతో భారత యువ షూటర్లు ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. మంగళవారం భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో తెలంగాణకు చెందిన బధిర షూటర్ ధనుశ్ శ్రీకాంత్, అభినవ్ షా, పార్థ్ రాకేశ్ మానెలతో కూడిన భారత బృందం పసిడి పతకం గెల్చుకుంది. ధనుశ్ శ్రీకాంత్, అభినవ్, పార్థ్ బృందం మొత్తం 1886.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో గౌతమి భానోత్, సోనమ్ మస్కర్, స్వాతి చౌధరీలతో కూడిన భారత జట్టు 1886.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. ఆంధ్ర షూటర్ ఉమామహేశ్‌కు కాంస్యం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ కాంస్య పతకం సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయవాడకు చెందిన ఉమామహేశ్ 229 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. రొమైన్ అఫ్రెరె (ఫ్రాన్స్; 251.2 పాయింట్లు) స్వర్ణం, హాంగ్హావో వాంగ్ (చైనా; 251 పాయింట్లు) రజతం సాధించారు. ఉమామహేశ్తోపాటు ఫైనల్లో పోటీపడ్డ అభినవ్ షా 207.2 పాయింట్లతో నాలుగో స్థానంలో, ధనుశ్ శ్రీకాంత్ 164.9 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. 64 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో అభినవ్ షా 631.4 పాయింట్లతో తొలి స్థానంలో, ధనుశ్ శ్రీకాంత్ 629.9 పాయింట్లతో మూడో స్థానంలో, ఉమామహేశ్ 627.9 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు జూనియర్ మహిళల స్కీట్ ఈవెంట్లో భారత షూటర్ రైజా ధిల్లాన్ రజత పతకం సాధించింది. ఆరుగురు షూటర్లు పాల్గొన్న ఫైనల్లో రైజా, మిరోస్లావా హకోవా (స్లొవేకియా) 51 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే స్వర్ణ, రజత పతకాల కోసం ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా మిరోస్లావా రెండు పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం ఖరారు చేసుకోగా... ఒక పాయింట్ సాధించిన రైజాకు రజతం దక్కింది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 10 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం
భోపాల్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం భారత్ ఖాతా లో ఒక కాంస్య పతకం చేరింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా మూడో స్థానంలో నిలిచింది. ఎంబీబీఎస్ చదువుతోన్న పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల సిఫ్ట్ కౌర్ క్వాలిఫయింగ్‌లో 588 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్ రౌండ్లో సిఫ్ట్ కౌర్ 403.9 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. సిఫ్ట్ కౌర్కిది రెండో ప్రపంచకప్ పతకం. గత ఏడాది కొరియాలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఆమె కాంస్య పతకం సాధించింది. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. చైనా ఎనిమిది స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. చదవండి: PAK vs AFG: టీ20ల్లో పాక్ బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
ISSF World Championships: స్వప్నిల్ గురికి ‘పారిస్’ బెర్త్ ఖరారు
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ ద్వారా భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. ఈజిప్ట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో శనివారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలె నాలుగో స్థానంలో నిలిచి 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు షూటింగ్లో భారత్‌కు మూడు ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. ట్రాప్ ఈవెంట్లో భౌనీష్ మెందిరత్త, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో రుద్రాం„Š పాటిల్ పారిస్ విశ్వ క్రీడలకు అర్హత సాధించారు. -
World Shooting Championship: అనీశ్ – సిమ్రన్‌లకు సిల్వర్ మెడల్
కైరో: వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో రజత పతకాన్ని గెలుచుకుంది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత ద్వయం రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్లో అనీశ్ – సిమ్రన్ప్రీత్ కౌర్ ద్వయం 14–16 స్కోరుతో ఉక్రెయిన్‌కు చెందిన యులి యా కొరొస్టైలోపొవా – మాక్సిమ్ హొరడైనెట్స్ చేతిలో పరాజయంపాలైంది. తాజా వెండి పతకంతో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 26కు చేరగా, జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 10 స్వర్ణాలు, 6 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. చదవండి: T20 WC 2022: పేరుకే రెండుసార్లు చాంపియన్.. మరీ ఇంత దారుణంగా! సూపర్-12లో ఐర్లాండ్ -
World Shooting Championship: భారత షూటర్ల జోరు
కైరో: ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో రమిత 16–12తో చైనా షూటర్ యింగ్ షెన్‌పై గెలుపొందింది. జూనియర్ మహిళల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు దివ్యాంశి (547 పాయింట్లు) స్వర్ణం, వర్షా సింగ్ (539 పాయింట్లు) రజతం, టియానా (523 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ మొత్తం 25 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
ఇషా జట్టుకు స్వర్ణం
కైరో (ఈజిప్ట్): ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్లో భారత షూటర్ల పసిడి వేట కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో తాజాగా భారత్‌కు మరో మూడు స్వర్ణ పతకాలు లభించాయి. జూనియర్ మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, వర్షా సింగ్, శిఖా నర్వాల్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకం గెలిచింది. ఫైనల్లో భారత్ 16–6తో చైనా జట్టును ఓడించింది. జూనియర్ మహిళల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో తిలోత్తమా సేన్, నాన్సీ, రమితాలతో కూడిన భారత జట్టు 16–2తో చైనా జట్టుపై గెలిచి స్వర్ణం నెగ్గింది. జూనియర్ పురుషుల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో శ్రీ కార్తీక్ శబరి రాజ్, దివ్యాంశ్ సింగ్ పన్వర్, విదిత్ జైన్‌లతో కూడిన భారత జట్టు 17–11తో చైనా జట్టుపై గెలిచి బంగారు పతకం సాధించింది. ఇప్పటి వరకు ఈ టోరీ్నలో భారత్ 9 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
భారత జట్టుకు కాంస్యం
కైరో (ఈజిప్ట్): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇలవేనిల్, మెహులీ ఘోష్, మేఘన సజ్జనార్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో భారత్ 17–11తో జర్మనీపై గెలిచింది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో సమీర్ రజతం గెలిచాడు. ఫైనల్లో సమీర్ 23–25తో వాంగ్ షివెన్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
ISSF World Championship: 18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్
కైరో: విశ్వ వేదికగా మరోసారి భారత షూటర్ గురి అదిరింది. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్ షిప్లో భారత్ ‘పసిడి’ ఖాతా తెరిచింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ స్వర్ణ పతకంతో మెరిశాడు. ఈ ప్రదర్శనతో రుద్రాంక్ష్ 2024 పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. థానేకు చెందిన రుద్రాంక్ష్ ఫైనల్లో 17–13 పాయింట్ల తేడాతో డానిలో డెనిస్ సొలాజో (ఇటలీ)పై గెలుపొందాడు. తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న రుద్రాంక్ష్ ఫైనల్లో ఒకదశలో 4–10తో వెనుకంజలో ఉన్నాడు. అయినా ఒత్తిడికి లోనుకాకుండా లక్ష్యంపై గురి పెట్టిన ఈ టీనేజ్ షూటర్ చివరకు నాలుగు పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు 114 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్ 633.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన అంకుశ్ కిరణ్ జాదవ్ 630.6 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్ మ్యాచ్‌కు అర్హత సాధించారు. ర్యాంకింగ్ మ్యాచ్‌లో సొలాజో 262.7 పాయింట్లతో, రుద్రాంక్ష్ 261.9 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన స్వర్ణ పతక పోరుకు అర్హత పొందారు. అంకుశ్ 154.2 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ర్యాంకింగ్ మ్యాచ్‌లో 261.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన చైనా షూటర్ లిహావో షెంగ్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. అభినవ్ బింద్రా తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ షూటర్‌గా రుద్రాంక్ష్ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా రుద్రాంక్ష్ రికార్డు నెలకొల్పాడు. గత ఏడాది పెరూలో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రుద్రాంక్ష్ రజతం నెగ్గగా.. ఈ ఏడాది జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించాడు. ఈ సంవత్సరమే సీనియర్ జట్టులోకి వచ్చిన రుద్రాంక్ష్ రెండు ప్రపంచకప్‌లలో పాల్గొన్నా పతకం సాధించలేకపోయాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరిసి స్వర్ణంతోపాటు ఒలింపిక్స్‌కు అర్హత పొంది ఔరా అనిపించాడు. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆరో భారతీయ షూటర్ రుద్రాంక్ష్ . గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్‌జిత్ సంధూ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్) ఈ ఘనత సాధించారు. -
Paris Olympics: భారత్‌కు ‘పారిస్’ తొలి బెర్త్ ఖరారు
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచ షూటింగ్ షాట్‌గన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్ భౌనీష్ మెందిరత్తా త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. అయితే తన ప్రదర్శనతో అతను 2024 పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్‌కు తొలి బెర్త్‌ను ఖరారు చేశాడు. బుధవారం జరిగిన పురుషుల ట్రాప్ ఈవెంట్లో హరియాణాకు చెందిన 23 ఏళ్ల భౌనీష్ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఎలిమినేషన్ పద్ధతిలో నలుగురు పోటీపడిన ఫైనల్లో భౌనీష్ 13 పాయింట్లు స్కోరు చేసి ముందుగా నిష్క్రమించాడు. అయినప్పటికీ ఫైనల్ చేరడంద్వారా భౌనీష్ భారత్‌కు తొలి ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. స్కాట్ డెన్రిక్ (అమెరికా; 33 పా యింట్లు), నాథన్ హేల్స్ (బ్రిటన్; 31 పాయింట్లు), కున్ పి యాంగ్ (చైనీస్ తైపీ; 23 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెల్చుకోవడంతోపాటు తమ దేశాలకు ఒలింపిక్ బెర్త్‌లను ఖరారు చేశారు. అంతకుముందు 154 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో భౌనీష్ 121 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచి ఎనిమిది మంది పోటీపడే ర్యాంకింగ్ రౌండ్‌కు అర్హత సాధించాడు. -
షూటర్ మనూ భాకర్‌కు నాలుగో స్వర్ణం
World Junior Shooting Championship: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ మనూ భాకర్ నాలుగో స్వర్ణం సాధించింది. పెరూలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మహిళల టీమ్ 25 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్లో మనూ, రిథమ్, నామ్యా కపూర్లతో కూడిన టీమిండియా 16–4తో అమెరికాపై నెగ్గింది. పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్ లో, 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు రజతాలు దక్కాయి. భారత్, ఆ్రస్టేలియా తొలి టి20 వర్షార్పణం వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య గోల్డ్‌కోస్ట్‌లో గురువారం జరిగిన తొలి టి20 క్రికెట్ మ్యాచ్ రద్దయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 15.2 ఓవర్లలో 4 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం వచి్చంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు) దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో టి20ల్లో 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో భారత మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. -
ఆయుష్ బృందానికి రజతం
చాంగ్‌వన్ (దక్షిణ కొరియా): హైదరాబాద్ యువ షూటర్ ఆయుష్ రుద్రరాజు ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ జూనియర్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించాడు. మంగళవారం జరిగిన జూనియర్ పురుషుల స్కీట్ ఈవెంట్లో ఆయుష్ రుద్రరాజు (119 పాయింట్లు), గుర్నిహాల్ సింగ్ గర్చా (119), నరూక అనంత్‌జీత్ సింగ్ (117)లతో కూడిన భారత బృందం 355 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో గుర్నిహాల్ సింగ్ 46 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. క్వాలిఫయింగ్‌లో గుర్నిహాల్, ఆయుష్ 119 పాయింట్లతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు. అయితే ఆరో బెర్త్ కోసం వీరిద్దరి మధ్య షూట్ ఆఫ్ నిర్వహించారు. గుర్నిహాల్ మూడు పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత పొందగా... ఆయుష్ రెండు పాయింట్లే స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. టీమ్ విభాగంలో చెక్ రిపబ్లిక్ (356 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... ఇటలీ జట్టు (354 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది. మరోవైపు సీనియర్ మహిళల స్కీట్ ఈవెంట్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. హైదరాబాద్ షూటర్ రష్మీ రాథోడ్ (108), మహేశ్వరి చౌహాన్ (106), గనెమత్ సెఖాన్ (105)లతో కూడిన భారత జట్టు 319 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ ముగ్గురూ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మరో మూడు రోజుల్లో ముగియనున్న ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు భారత్ 7 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 22 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
అంకుర్ గురి అదరహో
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన పోటీల్లో అంకుర్ మిట్టల్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో రెండు పతకాలు సాధించాడు. వ్యక్తిగత ఈవెంట్లో బంగారు పతకం, టీమ్ ఈవెంట్లో కాంస్యంతో సత్తా చాటుకున్నాడు. ఫైనల్లో అంకుర్ మిట్టల్, ఇయాంగ్ యంగ్ (చైనా) 140 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. అయితే షూట్ ఆఫ్‌లో అంకుర్ 4 పాయింట్లు... ఇయాంగ్ యంగ్ 3 పాయింట్లు సాధించారు. దాంతో అంకుర్‌కు స్వర్ణం... ఇయాంగ్ యంగ్‌కు రజతం ఖాయ మయ్యాయి. అండ్రెజ్ (స్లొవేకియా) కాంస్య పతకం గెలిచాడు. టీమ్ ఈవెంట్లో అంకుర్, అసబ్, శార్దూల్‌లతో కూడిన భారత జట్టు 409 పాయింట్లతో కాంస్యం నెగ్గింది. ఇటలీ జట్టుకు (411) స్వర్ణం, చైనా బృందం (410) రజతం గెలుపొందాయి. మరోవైపు ఇద్దరు భారత మహిళా షూటర్లు త్రుటిలో ఫైనల్ అర్హత కోల్పోయారు. 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో రజతం నెగ్గిన అంజుమ్ మౌద్గిల్... 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్ రౌండ్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మహిళల 25 మీ. పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ పదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఇప్పటి వరకు భారత్ 20 పతకాలు సాధించగా, ఇందులో ఏడు చొప్పున స్వర్ణాలు, రజతాలు, ఆరు కాంస్య పతకాలున్నాయి. -
మళ్లీ మెరిసిన సౌరభ్ చౌదరి
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గి సంచలనం సృష్టించిన 16 ఏళ్ల భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి అదే జోరును ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కొనసాగించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ ఈవెంట్లో అతను బంగారు పతకం సాధించాడు. ఈ పోటీలో సౌరభ్ 245.5 స్కోరుతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (243.7 పాయింట్లు)ను తానే అధిగమించి కొత్త రికార్డు సృష్టించాడు. జర్మనీలో జూన్‌లో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. హోజిన్ లిమ్ (243.1 పాయింట్లు; కొరియా) రజతం నెగ్గగా, అర్జున్ సింగ్ చీమా (218 పాయింట్లు; భారత్) కాంస్యం గెలిచాడు. పలు టీమ్ ఈవెంట్లలో భారత షూటర్లు పతకాలపై గురి పెట్టారు. జూనియర్ పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో అమన్ అలీ, వివాన్ కపూర్, మానవాదిత్య సింగ్ రాథోడ్‌లతో కూడిన భారత బృందం (348 పాయింట్లు) రజత పతకం గెలిచింది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ఓంప్రకాశ్, షాజర్ రిజ్వీ బృందం (1738 పాయింట్లు) రజతం సాధించింది. -
దివ్యాంశ్ శ్రేయ జంటకు కాంస్యం
చాంగ్వాన్ (కొరియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు భారత సీనియర్ షూటర్లు విఫలమైనా జూనియర్లు సత్తా చాటారు. 10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ జూనియర్ ఈవెంట్లో దివ్యాంశ్ సింగ్–శ్రేయ అగర్వాల్ జోడీ కాంస్యం సాధించింది. ఫైనల్లో దివ్యాంశ్–శ్రేయ జంట 435 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. అంతకుముందు 42 జట్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్లో దివ్యాంశ్–శ్రేయ జోడీ 834.4 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరగా... మరో భారత జంట ఎలవనీల్ వలరివన్–హిృదయ్ హజారికా జంట (829.5 పాయింట్లు) 13వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ ప్రస్తుతం మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో పతకాల పట్టికలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. సీనియర్లు విఫలం... 2020 టోక్యో ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నమెంట్‌గా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో పురుషుల 50 మీ. రైఫిల్ ప్రోన్ విభాగంలో చైన్ సింగ్ 623.9 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచి నిరాశపరచగా... తాజా ఆసియా క్రీడల రజత పతక విజేత సంజీవ్ రాజ్‌పుత్ (620 పాయింట్లు) 48వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టీమ్ విభాగంలో చైన్ సింగ్, సంజీవ్, గగన్ నారంగ్‌ల త్రయం 1856.1 పాయింట్లతో 15వ స్థానం దక్కించుకుంది. మహిళల 50 మీ. రైఫిల్ ప్రోన్ విభాగంలో తేజస్విని సావంత్ 617.4 పాయింట్లతో 28వ స్థానం దక్కించుకోగా... అంజుమ్ మౌద్గిల్ (616.5 పాయింట్లు) 33వ స్థానం... శ్రేయ సక్సేనా (609.9 పాయింట్లు) 54వ స్థానంలో నిలిచారు. టీమ్ విభాగంలో అంజుమ్, తేజస్విని, శ్రేయలతో కూడిన భారత జట్టు 1848.1 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. -
విశ్వ విజేత ఓం ప్రకాశ్
చాంగ్వాన్ (కొరియా): అంతర్జాతీయ స్థాయిలో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. ఇటీవల కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాల పంట పండించిన భారత షూటర్లు అదే జోరును ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పునరావృతం చేస్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నమెంట్‌గా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో మంగళవారం భారత పిస్టల్ షూటర్ ఓం ప్రకాశ్ మిథర్వాల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకొని జగజ్జేతగా అవతరించాడు. 50 మీటర్ల పిస్టల్ విభాగంలో 23 ఏళ్ల ఓం ప్రకాశ్ 564 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఓం ప్రకాశ్ 10 మీ., 50 మీ. ఎయిర్ పిస్టల్ విభాగాల్లో కాంస్యాలు గెలుచుకున్నాడు. దమిర్ వికెట్ (సెర్బియా–562 పాయింట్లు), డెమ్యుంగ్ లీ (దక్షిణ కొరియా–560 పాయింట్లు) రజతం, కాంస్యం నెగ్గారు. అయితే, 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుపొందిన జీతూ రాయ్... ఈసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 552 పాయింట్లతో అతను 17వ స్థానంలో నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లేనందున ఎవరికీ ఒలింపిక్ బెర్త్‌లు దక్కలేదు. ఇక జూనియర్ స్థాయి 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తాజా ఏషియాడ్ స్వర్ణ విజేత సౌరభ్ చౌదరి, అభిద్న్య పాటిల్ జోడీ కాంస్యం సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో మను భాకర్ (574 పాయింట్లు) 13వ స్థానంలో, హీనా సిద్ధూ 571 పాయింట్లతో 29వ స్థానంలో నిలిచారు. సోమవారం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతం నెగ్గిన అంజుమ్ మౌద్గిల్, నాలుగో స్థానంలో నిలిచిన అపూర్వీ చండేలాలు భారత్‌కు రెండు ఒలింపిక్ కోటా బెర్త్‌లు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన నాలుగో భారతీయ షూటర్‌గా ఓం ప్రకాశ్ గుర్తింపు పొందాడు. గతంలో అభినవ్ బింద్రా (2006), మానవ్‌జిత్ సంధూ (2006), తేజస్విని సావంత్ (2010) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
భారత్‌కు 2 రజతాలు
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ సీనియర్ విభాగంలో భారత్ ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో భారత్‌కు రజత పతకాలు లభించాయి. వ్యక్తిగత విభాగంలో అంజుమ్ మౌద్గిల్ (248.4 పాయింట్లు) రజతం నెగ్గగా... అంజుమ్, అపూర్వీ చండేలా, మెహులీ ఘోష్‌లతో కూడిన భారత జట్టు (1879 పాయింట్లు) రజతం సాధించింది. అపూర్వీ చండేలా (207 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. అంజుమ్, అపూర్వీ టాప్–4లో నిలిచినందుకు భారత్‌కు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రెండు బెర్త్‌లు ఖరారయ్యాయి. -
జీతూ రాయ్‌కు రజతం
రియో ఒలింపిక్స్‌కు అర్హత ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ గ్రనాడా (స్పెయిన్): ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత పిస్టల్ షూటర్ జీతూ రాయ్ ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లోనూ మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ రజతం సాధించాడు. తద్వారా 2016లో రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడయ్యాడు. ఫైనల్లో జీతూ రాయ్ 191.1 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. భారత సైన్యంలో పనిచేసే 25 ఏళ్ల జీతూ రాయ్‌కు ఇది వరుసగా ఐదో అంతర్జాతీయ పతకం కావడం విశేషం. ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ అయోనిక పాల్ ఫైనల్‌కు చేరుకున్నా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కిది ఎనిమిదో పతకం. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ‘ట్రిపుల్ ఒలింపిక్ చాంపియన్’ జిన్ జోంగో (దక్షిణ కొరియా) 192.3 పాయింట్లతో స్వర్ణ పతకం... వీ పాంగ్ (చైనా) 172.6 పాయింట్లతో కాంస్యం సాధించారు. క్వాలిఫయింగ్‌లో జిన్ జోంగో 583 పాయింట్లు స్కోరు చేసి 34 ఏళ్లుగా ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు 581 పాయింట్లతో అలెగ్జాండర్ మెలెంటియెవ్ (1980 మాస్కో ఒలింపిక్స్) పేరిట ఉండేది. -
అభినవ్ బింద్రా విఫలం
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ గ్రనాడా (స్పెయిన్): కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన విభాగంలో భారత మేటి షూటర్ అభినవ్ బింద్రా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిరాశపరిచాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో... బింద్రా ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో బింద్రా 624.8 పాయింట్లు స్కోరు చేసి 15వ స్థానంలో నిలిచాడు. టాప్-8లో నిలిచినవారే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఇదే విభాగంలో భారత షూటర్లు సంజీవ్ రాజ్‌పుత్ 624.2 పాయింట్లతో 20వ స్థానంలో, రవి కుమార్ 616.2 పాయింట్లతో 78వ స్థానంలో నిలిచారు. పురుషుల ట్రాప్ ఈవెంట్లో రెండు రౌండ్ల తర్వాత మానవ్‌జిత్ సంధూ 50 పాయింట్లతో మరో 11 మందితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ 46 పాయింట్లతో 93వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ విభాగంలో మరో మూడు రౌండ్లు ఉన్నాయి. -
ప్రపంచ షూటింగ్ పోటీలకు కైనన్
10 మీ.ఎయిర్ రైఫిల్ జట్టులో గగన్ నారంగ్‌కు దక్కని చోటు న్యూఢిల్లీ: రియో డి జనీరో-2016 ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నమెంట్ అయిన ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ ట్రాప్ షూటర్ కైనన్ చెనాయ్కు చోటు లభించింది. స్పెయిన్‌లోని గ్రెనడా నగరంలో ఈ ఏడాది సెప్టెంబరు 8 నుంచి 19 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత జట్టును మంగళవారం ప్రకటించారు. పురుషుల ‘ట్రాప్’ ఈవెంట్లో ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్‌లతో కలిసి 23 ఏళ్ల కైనన్ బరిలోకి దిగుతాడు. 2008 పుణే కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన కైనన్... గతేడాది జరిగిన సింగపూర్ ఓపెన్‌లోనూ పసిడి పతకాన్ని సాధించాడు. హైదరాబాద్‌కే చెందిన మరో స్టార్ షూటర్ గగన్ నారంగ్‌కు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టులో స్థానం లభించలేదు. అయితే గగన్ నారంగ్ మిగతా రెండు ఈవెంట్స్ రైఫిల్ త్రీ పొజిషన్, రైఫిల్ ప్రోన్ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. లండన్ ఒలింపిక్స్‌లో గగన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్ ద్వారా తొలి విడతగా 64 మంది షూటర్లు 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.