
World Junior Shooting Championship: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ మనూ భాకర్ నాలుగో స్వర్ణం సాధించింది. పెరూలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో మహిళల టీమ్ 25 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్లో మనూ, రిథమ్, నామ్యా కపూర్‌లతో కూడిన టీమిండియా 16–4తో అమెరికాపై నెగ్గింది. పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్ లో, 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు రజతాలు దక్కాయి.
భారత్, ఆ్రస్టేలియా తొలి టి20 వర్షార్పణం
వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య గోల్డ్‌కోస్ట్‌లో గురువారం జరిగిన తొలి టి20 క్రికెట్ మ్యాచ్ రద్దయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 15.2 ఓవర్లలో 4 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం వచి్చంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు) దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో టి20ల్లో 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో భారత మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది.