ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో తొలి రోజు భారత షూటర్లకు నిరాశ మిగిలింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
మ్యూనిచ్: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో తొలి రోజు భారత షూటర్లకు నిరాశ మిగిలింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా, చెయిన్ సింగ్... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అయోనికా పాల్, పూజా ఘాట్కర్ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.
అభినవ్ బింద్రా 626.2 పాయింట్లతో 15వ స్థానంలో, చెయిన్ సింగ్ 622.8 పాయింట్లతో 41వ స్థానంలో నిలిచారు. పూజా 417.4 పాయింట్లతో 13వ, అయోనిక 417.2 పాయింట్లతో 16వ స్థానంతో సంతృప్తి పడ్డారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్, ప్రకాశ్ నంజప్ప, ఓంకార్ సింగ్ క్వాలిఫయింగ్ రౌండ్‌కు అర్హత సాధించారు.