ISSF World Cup tournament
-
స్వర్ణ పతకంపై ఇలవేనిల్ బృందం గురి
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో ఇలవేనిల్, రమిత, శ్రేయాలతో కూడిన భారత బృందం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరింది. అజర్బైజాన్ లో జరుగుతున్న ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ స్టేజ్–1లో ఇలవేనిల్, రమిత, శ్రేయ జట్టు 944.4 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో... క్వాలిఫయింగ్ స్టేజ్–2లో 628.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. నేడు జరిగే ఫైనల్లో డెన్మార్క్‌తో భారత జట్టు ఆడుతుంది. చదవండి: French Open: సిట్సిపాస్‌కు చుక్కెదురు -
ISSF World Cup 2022: భారత్‌కు తొలి గోల్డ్ మెడల్.. అదరగొట్టిన సౌరభ్ చౌదరీ
Saurabh Wins Gold In ISSF World Cup In Cairo: సీనియర్ విభాగంలో తొలిసారి ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ అదరగొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 17 ఏళ్ల ఇషా సింగ్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఇషా 4–16 పాయింట్ల తేడాతో ‘రియో ఒలింపిక్స్’ స్వర్ణ పతక విజేత అనా కొరాకాకి (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ భాగంలో సౌరభ్ చౌదరీ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో సౌరభ్ 16–6తో మైకేల్ ష్వాల్డ్ (జర్మనీ)పై గెలిచాడు. 19 ఏళ్ల సౌరభ్‌కు ప్రపంచకప్ టోర్నీలలో ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం. చదవండి: IND vs IRE: మూడేళ్ల తర్వాత ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. రోహిత్, కోహ్లి లేకుండానే! -
వరల్డ్ రికార్డుతో స్వర్ణ పతకం..
పుతియాన్(చైనా): భారత స్టార్ మహిళా షూటర్ మను భాకర్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఫైనల్ ఈవెంట్లో మను భాకర్ పసిడిని సొంతం చేసుకున్నారు. మొత్తంగా 244.7 పాయింట్లతో టాప్‌లో నిలిచి స్వర్ణాన్ని సాధించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ కేటగిరీలో భారత్‌కు ఇదే తొలి పసిడి కావడం మరో విశేషం. ఇదిలా ఉంచితే, మను భాకర్ స్వర్ణాన్ని సాధించే క్రమంలో నమోదు చేసిన స్కోరుతో జూనియర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశారు. మరొకవైపు ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో హీనా సిద్ధూ తర్వాత పసిడి సాధించిన రెండో భారత షూటర్‌గా మను భాకర్ గుర్తింపు సాధించారు. ఇక సెర్బియాకు చెందిన జోరానా అరునోవిక్ 241.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించగా, చైనాకు చెందిన క్వియాన్ వాంగ్ 221.8 పాయింట్లతో కాంస్యాన్ని దక్కించుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో భారత పురుష షూటర్లు అభిషేక్ వర్మ, సౌరవ్ చౌదరిలు ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. అభిషేక్ వర్మ 588 పాయింట్లతో ఫైనల్ బెర్తును సాధించగా, సౌరవ్ 581 పాయింట్లతో తుది పోరుకు సిద్ధమయ్యాడు. -
వరల్డ్ కప్ షూటింగ్ : భారత్‌కు మరో స్వర్ణం
మ్యూనిక్ (జర్మనీ) : అంతర్జాతీయ షూటింగ్ క్రిడా సమాఖ్య (ఏఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే అపూర్వి చండేలా రూపంలో భారత్‌కు ఒక స్వర్ణం రాగా.. సోమవారం మరో గోల్డ్ పతకం వచ్చి చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గురి తప్పని సౌరభ్ చౌదరీ.. భారత్ కు మరో గోల్డ్ అందించాడు. ఫైనల్లో మొత్తం 246.3 పాయింట్లతో తన పాత రికార్డును(245 పాయింట్లు) బద్దలు కొడుతూ సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా ఈ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న రెండో భారత షూటర్‌గా సౌరభ్ చౌదరి నిలిచాడు. (చదవండి : అపూర్వీ పసిడి గురి) ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అపూర్వి చండేలా పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది షూటర్ల మధ్య 24 షాట్లతో ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వీ 251 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
భారత షూటర్లకు నిరాశ
మ్యూనిచ్: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ టోర్నమెంట్లో తొలి రోజు భారత షూటర్లకు నిరాశ మిగిలింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా, చెయిన్ సింగ్... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అయోనికా పాల్, పూజా ఘాట్కర్ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. అభినవ్ బింద్రా 626.2 పాయింట్లతో 15వ స్థానంలో, చెయిన్ సింగ్ 622.8 పాయింట్లతో 41వ స్థానంలో నిలిచారు. పూజా 417.4 పాయింట్లతో 13వ, అయోనిక 417.2 పాయింట్లతో 16వ స్థానంతో సంతృప్తి పడ్డారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్, ప్రకాశ్ నంజప్ప, ఓంకార్ సింగ్ క్వాలిఫయింగ్ రౌండ్‌కు అర్హత సాధించారు.