
స్వప్నిల్‌కు స్వర్ణం
కువైట్ సిటీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. మంగళవారం భారత షూటర్ల గురికి నాలుగు పతకాలు ఖాతాలోకి చేరాయి. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే పసిడి పతకాన్ని సాధించాడు. ఫైనల్లో అతను 453.3 పాయింట్లు స్కోరు చేశాడు.
స్వప్నిల్, అఖిల్ షెరాన్, ఇషాన్ గోయెల్‌లతో కూడిన భారత జట్టు టీమ్ ఈవెంట్‌లో రజతం నెగ్గింది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత బృందానికి రజత పతకం లభించింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టుకు కాంస్య పతకం దక్కింది.