భారత షూటర్లకు మరో ఐదు పతకాలు | Indian shooters bag five medals at Junior World Cup | Sakshi
Sakshi News home page

భారత షూటర్లకు మరో ఐదు పతకాలు

Published Thu, Sep 22 2016 12:31 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM

Indian shooters bag five medals at Junior World Cup

 గబాలా (అజర్‌బైజాన్): జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోటీల్లో భారత్‌కు మొత్తం ఐదు పతకాలు లభించాయి. ఇందులో మూడు స్వర్ణాలు, రజతం, కాంస్యం ఉన్నాయి. మహిళల, పురుషుల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్లకు పసిడి పతకాలు దక్కాయి. పురుషుల వ్యక్తిగత 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అన్‌హద్ జవాండా భారత్‌కు మరో స్వర్ణం అందించగా... గుర్మీత్ రజతం గెలిచాడు. ప్రగతి గుప్తా, సౌమ్య గుప్తా, మనీషాలతో కూడిన భారత మహిళల జట్టుకు ట్రాప్ ఈవెంట్‌లో కాంస్యం లభించింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు భారత్‌కు 9 స్వర్ణాలు, 5 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు వచ్చాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement