భారత షూటర్లకు మరో రెండు ఒలింపిక్‌ బెర్త్‌లు  | Two more Olympic berths for Indian shooters | Sakshi
Sakshi News home page

భారత షూటర్లకు మరో రెండు ఒలింపిక్‌ బెర్త్‌లు 

Published Sun, Jan 21 2024 4:04 AM | Last Updated on Sun, Jan 21 2024 4:04 AM

Two more Olympic berths for Indian shooters - Sakshi

కువైట్‌ సిటీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటర్ల సంఖ్య 19కు చేరుకుంది. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ షాట్‌గన్‌ టోర్నమెంట్‌లో మహిళల స్కీట్‌ విభాగంలో రైజా ధిల్లాన్‌... పురుషుల స్కీట్‌ విభాగంలో అనంత్‌ జీత్‌ సింగ్‌ నరూకా రజత పతకాలు సాధించారు.

తద్వారా ఈ రెండు కేటగిరీల్లో భారత్‌కు రెండు ఒలింపిక్‌ బెర్త్‌లను ఖరారు చేశారు. ఫైనల్స్‌లో 19 ఏళ్ల రైజా 52 పాయింట్లు స్కోరు చేయగా... అనంత్‌ 56 పాయింట్లు సాధించాడు. ఈ రెండు బెర్త్‌లతో ఈసారి భారత షూటర్లు ఒలింపిక్స్‌లో అన్ని మెడల్‌ ఈవెంట్స్‌కు అర్హత సాధించడం జరిగింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement