జకార్తాలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. ఆదివారం భారత షూటర్ల ఖాతాలోకి రెండు స్వర్ణ పతకాలు చేరాయి.
పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ యోగేశ్ సింగ్ (572 పాయింట్లు) పసిడి పతకం నెగ్గాడు. యోగేశ్, అమిత్, ఓం ప్రకాశ్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1690 పాయింట్లతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment