ఆసియా ఒలింపిక్ షాట్‌గన్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ లక్ష్య షెరోన్ కాంస్య పతకం సాధించాడు. కువైట్ సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో లక్ష్య మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో లక్ష్య పతకం సాధించినప్పటికీ పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సంపాదించలేకపోయాడు. ఒలింపిక్స్ బెర్త్‌ను లక్ష్య తృటిలో కోల్పోయాడు.
ఆరుగురు షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ ఫైనల్లో 25 ఏళ్ల లక్ష్య 33 పాయింట్లు స్కోరు చేశాడు. ఇరాన్‌కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు మొహమ్మద్ బెరాన్‌వంద్ స్వర్ణం, 32 ఏళ్ల చైనా షూటర్ గువో యుహావో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment