shotgun shooting
-
భారత ట్రాప్ షూటర్లకు నిరాశ
ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నీలో తొలిరోజు భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. మొరాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల, పురుషుల ట్రాప్ వ్యక్తిగత విభాగాల్లో భారత షూటర్లెవరూ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మహిళల ట్రాప్ క్వాలిఫయింగ్‌లో రాజేశ్వరి 113 పాయింట్లతో 8వ ర్యాంక్‌లో నిలిచింది. టాప్–6లో నిలిచినవారు ఫైనల్ చేరుకుంటారు. భారత్‌కే చెందిన భవ్య 19వ ర్యాంక్‌లో, మనీషా 24వ ర్యాంక్‌లో నిలిచారు. పురుషుల ట్రాప్ క్వాలిఫయింగ్‌లో భౌనీష్ 17వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
పాపం లక్ష్య.. పతకం సాధించినా దక్కని ఒలింపిక్స్ బెర్త్
ఆసియా ఒలింపిక్ షాట్‌గన్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ లక్ష్య షెరోన్ కాంస్య పతకం సాధించాడు. కువైట్ సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో లక్ష్య మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో లక్ష్య పతకం సాధించినప్పటికీ పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సంపాదించలేకపోయాడు. ఒలింపిక్స్ బెర్త్‌ను లక్ష్య తృటిలో కోల్పోయాడు. ఆరుగురు షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ ఫైనల్లో 25 ఏళ్ల లక్ష్య 33 పాయింట్లు స్కోరు చేశాడు. ఇరాన్‌కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు మొహమ్మద్ బెరాన్వంద్ స్వర్ణం, 32 ఏళ్ల చైనా షూటర్ గువో యుహావో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. -
Paris Olympics: భారత్‌కు ‘పారిస్’ తొలి బెర్త్ ఖరారు
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచ షూటింగ్ షాట్‌గన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్ భౌనీష్ మెందిరత్తా త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. అయితే తన ప్రదర్శనతో అతను 2024 పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్‌కు తొలి బెర్త్‌ను ఖరారు చేశాడు. బుధవారం జరిగిన పురుషుల ట్రాప్ ఈవెంట్లో హరియాణాకు చెందిన 23 ఏళ్ల భౌనీష్ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఎలిమినేషన్ పద్ధతిలో నలుగురు పోటీపడిన ఫైనల్లో భౌనీష్ 13 పాయింట్లు స్కోరు చేసి ముందుగా నిష్క్రమించాడు. అయినప్పటికీ ఫైనల్ చేరడంద్వారా భౌనీష్ భారత్‌కు తొలి ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. స్కాట్ డెన్రిక్ (అమెరికా; 33 పా యింట్లు), నాథన్ హేల్స్ (బ్రిటన్; 31 పాయింట్లు), కున్ పి యాంగ్ (చైనీస్ తైపీ; 23 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెల్చుకోవడంతోపాటు తమ దేశాలకు ఒలింపిక్ బెర్త్‌లను ఖరారు చేశారు. అంతకుముందు 154 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో భౌనీష్ 121 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచి ఎనిమిది మంది పోటీపడే ర్యాంకింగ్ రౌండ్‌కు అర్హత సాధించాడు. -
అనిరుధ్‌కు స్వర్ణం
షూటింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అనిరుధ్ స్వర్ణంతో మెరిశాడు. గచ్చిబౌలీలోని శాట్స్ షూటింగ్ రేంజ్లో జరిగిన ఈ పోటీల్లో జెడ్79- క్లే పీజియన్ స్కీట్ విభాగంలో అనిరుధ్ 35 పాయింట్లు సాధించి పసిడి పతకాన్ని దక్కించుకోగా... అభినవ్, రిజ్వాన్‌లు రజత కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఇతర విభాగాల్లో విరాజ్ (జెడ్-81), సొనాలి రాజు (జెడ్82), రాజేంద్ర ప్రసాద్ (జెడ్ 84), ఆయూష్ (ఎన్79), సుభాష్ (ఎన్80)లు పసిడి పతకాలను గెలుచుకున్నారు.