శ్రియాంక గురికి 13వ బెర్తు  | 13th berth to Sriyanka | Sakshi
Sakshi News home page

శ్రియాంక గురికి 13వ బెర్తు 

Published Wed, Nov 1 2023 2:21 AM | Last Updated on Wed, Nov 1 2023 2:21 AM

13th berth to Sriyanka - Sakshi

న్యూఢిల్లీ: భారత షూటర్లు పారిస్‌ ఒలింపిక్సే లక్ష్యంగా ఆసియా షూ టింగ్‌ చాంపియన్‌షిప్‌లో రాణిస్తున్నారు. తాజాగా శ్రియాంక సదాంగి ఒలింపిక్స్‌ బెర్తు సంపాదించింది. కొరియాలోని చాంగ్వాన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రి పొజిషన్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.

పతకం  చేజారినా... ‘పారిస్‌’ గురి కుది రింది. ఆమె 440.5 స్కోరుతో నాలుగో స్థానంలో తృప్తిపడింది. ఆమెతో పాటు ఈ ఈవెంట్‌లో సిఫ్త్‌ కౌర్‌ సమ్రా, ఆషి చౌక్సీ, ఆయుషి పొడెర్‌లు కూడా క్వాలిఫయింగ్‌ మార్క్‌ దాటారు. షూటింగ్‌లో భారత్‌కిది 13వ ఒలింపిక్‌ బెర్తు కావడం విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement