న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత పసిడి వేట కొనసాగుతోంది. శనివారం ఆరంభమైన షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించగా, ఆదివారం భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి పసిడి పతకం సాధించాడు. తొలిసారి సీనియర్ విభాగంలో వరల్డ్‌కప్‌లో పాల్గొన సౌరభ్.. వరల్డ్ రికార్డు స్కోరుతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 245.0 పాయింట్లతో సౌరభ్ చౌదరి వరల్డ్ రికార్డు సాధించాడు. (ఇక్కడ చదవండి: ప్రపంచ రికార్డు... పసిడి పతకం)
ఫైనల్లో పొడియం పొజిషన్‌ను సాధించిన సౌరభ్ కడవరకూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే సెర్బియాకు చెందిన స్టార్ షూటర్ దామిర్ మికెక్‌పై వెనుక్కినెట్టి పసిడితో మెరిశాడు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సౌరభ్ కొట్టిన ప్రతీ షాట్ 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం విశేషం. ఫలితంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు బెర్తును ఖాయం చేసుకున్నాడు. గతేడాది జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సౌరభ్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగంలో కూడా వరల్డ్ రికార్డు సౌరభ్ చౌదరి పేరిటే ఉంది.
నిన్న మొదలైన ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో 26 ఏళ్ల అపూర్వి ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అపూర్వి 252.4 పాయింట్లతో గతేడాది ఏప్రిల్‌లో చైనా షూటర్ రుజు జావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment