న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. భారత స్టార్ షూటర్ అపూర్వి చండీలా రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో పసిడి గెలుచుకున‍్నారు. శనివారం ఆరంభమైన షూటింగ్ వరల్డ్‌కప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వి స్వర్ణాన్ని సాధించారు. సరికొత్త రికార్డుతో అపూర్వి పసిడి గెలుచుకోవడం విశేషం.
ఫైనల్లో మొత్తం 252. 9 పాయింట్లతో కొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పిన అపూర్వి పసిడితో మెరిశారు. ఫలితంగా వరల్డ్‌కప్ షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న రెండో భారత షూటర్‌గా అపూర్వి నిలిచారు. అంతకముందు అంజలీ భగవత్ ఈ ఫీట్ సాధించారు. కాగా, ఇది వరల్డ్‌కప్‌లో అపూర్వికి మూడో పతకం. గత ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో అపూర్వి రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
తాజా వరల్డ్‌కప్ షూటింగ్‌లో రజత, కాంస్య పతకాలు చైనా దక్కించుకుంది. జొహో రుజు(251.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకోగా, మరో చైనా షూటర్ ఝు హాంగ్(230.4) కాంస్యాన్ని దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment