షూటింగ్‌ ప్రపంచ కప్‌ నుంచి వైదొలిగిన భారత్‌  | India Pulls Out Of Shooting World Cup | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ ప్రపంచ కప్‌ నుంచి వైదొలిగిన భారత్‌ 

Published Sat, Feb 29 2020 10:03 AM | Last Updated on Sat, Feb 29 2020 10:03 AM

India Pulls Out Of Shooting World Cup - Sakshi

న్యూఢిల్లీ: సైప్రస్‌ వేదికగా మార్చి 4 నుంచి 13 వరకు జరిగే ప్రపంచ షూటింగ్‌ ప్రపంచ కప్‌ నుంచి భారత్‌ వైదొలిగింది. కోవిడ్‌–19 విజృంభిస్తున్న నేపథ్యంలో భార త షూటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భారత జాతీయ రైఫిల్‌ సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్‌–19 రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని దేశాలకు భారతీయులు ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిదంటూ ఈ నెల 26న తెలిపింది. ఆ దేశాల జాబితాలో సైప్రస్‌ ఉండటంతో భారత షూటర్లు షూటింగ్‌ ప్రపంచ కప్‌ ఈవెంట్‌కు దూరమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement