
రియో డి జనీరో (బ్రెజిల్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెం ట్‌లో భారత మహిళా షూటర్ ఇలవేనిల్ వలరివాన్ స్వర్ణ పతకాన్ని సాధించింది. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఇలవేనిల్ 251.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. సియోనైడ్ మెకంటోష్ (బ్రిటన్–250.6 పాయింట్లు) రజతం, యింగ్ షిన్ లిన్ (చైనీస్ తైపీ–229.9 పాయింట్లు) కాంస్యం సాధించారు. భారత్‌కే చెందిన అంజుమ్ మౌద్గిల్ (166.8 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచింది.