అపూర్వి.. అదుర్స్ | Apurvi Adhurs | Sakshi
Sakshi News home page

అపూర్వి.. అదుర్స్

Published Sun, Sep 6 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

అపూర్వి.. అదుర్స్

అపూర్వి.. అదుర్స్

ప్రపంచకప్ షూటింగ్‌లో రజతం
 
 మునిచ్ : భారత యువ షూటర్ అపూర్వి చండేలా... ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్ అండ్ పిస్టల్ ఈవెంట్‌లో సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అపూర్వి 206.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణం నెగ్గిన అహ్మది ఎల్హాన్ (ఇరాన్-207.5)కు ఈమెకు మధ్య తేడా కేవలం 0.6 పాయింట్లు మాత్రమే. ఆండ్రియా (సెర్బియా)కు కాంస్యం దక్కింది. ఫైనల్లో చండేలా ఆరంభం నుంచే ఆధిపత్యం చూపెట్టింది.

రెండుసార్లు 10.8 పాయింట్లు సాధించి సిరీస్-1లో మొత్తం 30.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే రెండో సిరీస్‌లో నిలకడ లేకపోవడంతో ఒక్క స్థానం కిందకు పడిపోయింది. ఫైనల్ షాట్‌లో చండేలా 10.2 పాయింట్లు నెగ్గితే.... ఎల్హాన్ 10.4 పాయింట్లు సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement