
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ జంటకు రజత పతకం దక్కింది.
ఫైనల్లో మనూ–సౌరభ్ జోడీ 12–16తో వితాలినా బత్సారష్‌కినా–అర్తెమ్ చెర్నోసువ్ (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఇదే ఈవెంట్ కాంస్య పతక పోరులో అభిషేక్ వర్మ–యశస్విని సింగ్ (భారత్) జోడీ 7–17తో గొల్నూష్ సెబ్‌గతోలాహి–జావెద్ ఫరూగి (ఇరాన్) జంట చేతిలో పరాజయం పాలైంది.