ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో సౌరభ్‌కు స్వర్ణం  | Sourabhs gold at the Asian Shooting Championship | Sakshi
Sakshi News home page

ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో సౌరభ్‌కు స్వర్ణం 

Nov 9 2018 2:41 AM | Updated on Nov 9 2018 2:41 AM

Sourabhs gold at the Asian Shooting Championship - Sakshi

భారత యువ షూటర్‌ సౌరభ్‌ చౌదరి ఆసియా ఎయిర్‌గన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ జూనియర్‌ విభాగంలో సౌరభ్‌ 239.8 పాయింట్లతో స్వర్ణం దక్కించుకున్నాడు. అర్జున్‌ (భారత్, 237.7 పాయింట్లు) రజతం, హువాంగ్‌ వై టి (చైనీస్‌తైపీ, 218 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నారు. 

టీమ్‌ విభాగంలో సౌరభ్, అర్జున్‌ సింగ్‌ చీమా, అన్‌మోల్‌ జైన్‌లతో కూడిన భారత జట్టు 1731 పాయింట్లతో పసిడి చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్‌ 10 (3 స్వర్ణ, 5 రజత, 2 కాంస్య) పతకాలు సాధించింది.    

Advertisement
 
Advertisement
Advertisement