Airgun
-
ఆస్తి కోసం కన్నతండ్రినే కడతేర్చేందుకు యత్నం!...ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపి పరారైన కొడుకు
మైసూరు: ఆస్తి కోసం తండ్రిని కన్నకొడుకు ఎయిర్‌గన్‌తో షూట్ చేసి పరారైన సంఘటన మైసూరు విజయనగర పరిధిలో చోటు చేసుకుంది. రేణుకా కళాశాలకు చెందిన ఆస్తి విషయంలో నెల రోజులుగా శివకుమార్, కొడుకు మధ్య రగడ జరుగుతోంది. ఆస్తిని తన పేరుమీద రాయాలని తండ్రితో గొడవ పడ్డాడు. స్నేహితులతో కలిసి ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపి పరారయ్యాడు. ఆ శబ్దాలకు చుట్టుపక్కల వారు వచ్చి గాయపడిన శివకుమార్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొడుకు, మిత్రులు పరారీలో ఉన్నారు -
మద్యం కోసం ఐటీ ఉద్యోగి వీరంగం
సాక్షి, జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పరిధిలోని ఓ వైన్ షాపు వద్ద మద్యం ఖరీదు చేయడానికి వచ్చిన ఐటీ ఉద్యోగి ఒకరు.. అక్కడ రద్దీ చూసి కంగుతిన్నాడు. క్యూతో సంబంధం లేకుండా మద్యం పొందడానికి తన వాహనానికి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న పోలీసు సైరన్ మోగించాడు. అదేమని ప్రశ్నించిన స్థానికులకు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్ చూపించి బెదిరించాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు ఐటీ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. (బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్: తమ్ముడిని చంపి, స్టోర్‌రూంలో) ఆల్విన్ కాలనీకి చెందిన కె.చంద్రహర్షారెడ్డి అలియాస్ హరీష్ ఐటీ కంపెనీలో ఉద్యోగి. షూటింగ్‌పై మక్కువ ఉన్న ఇతగాడు గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని ఫైరింగ్ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంగళవారం తన ప్రాక్టీసు ముగించుకుని ఎయిర్ గన్‌తో తన కారులో బయలుదేరారు. ఈ వాహనం ఎల్లమ్మబండ మీదుగా కూకట్పల్లి వైపు వెళ్తుండగా..రాత్రి 11 గంటల ప్రాంతంలో లాస్య వైన్స్ వద్ద మద్యం ఖరీదు చేయడానికి ఆపాడు. ఆ సమయంలో మద్యం దుకాణం రద్దీగా ఉండటం, మూసివేసే సమయం సమీపిస్తుండటంతో ‘తేలిగ్గా’ తన పని పూర్తి చేసుకోవాలని భావించాడు. అక్కడ ఉన్న వారిని చెదరగొట్టాలనే ఉద్దేశంతో హరీష్ తన కారుకు అక్రమంగా అమర్చుకున్న పోలీసు సైరన్‌ను మోగించాడు. సమీపంలో పాన్ షాప్ వద్ద నిలుచున్న దిలీప్ అనే వ్యక్తి సైరన్ ఎందుకు మోగించావంటూ హరీష్‌ను నిలదీశాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగడంతో సహనం కోల్పోయిన హరీష్ తన కారులో ఉన్న ఎయిర్ గన్ను బయటకు తీసి చంపుతానంటూ బెదిరించాడు. కొద్దిసేపు గాల్లో ఎయిర్ గన్ను ఊపుతూ హంగామా చేశాడు. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. హరీష్‌ను అదుపులోకి తీసుకుని వాహనంతో పాటు ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా పోలీసు సైరన్ వినియోగించడంతో పాటు ఎయిర్‌గన్‌తో బెదిరింపులకు దిగిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సౌరభ్‌కు స్వర్ణం
భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగంలో సౌరభ్ 239.8 పాయింట్లతో స్వర్ణం దక్కించుకున్నాడు. అర్జున్ (భారత్, 237.7 పాయింట్లు) రజతం, హువాంగ్ వై టి (చైనీస్‌తైపీ, 218 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నారు. టీమ్ విభాగంలో సౌరభ్, అర్జున్ సింగ్ చీమా, అన్మోల్ జైన్‌లతో కూడిన భారత జట్టు 1731 పాయింట్లతో పసిడి చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ 10 (3 స్వర్ణ, 5 రజత, 2 కాంస్య) పతకాలు సాధించింది. -
తుపాకీతో బెదిరించిన ఇద్దరి అరెస్ట్
కర్నూలు : కర్నూలులో ఓ బేకరీ వ్యాపారిని తుపాకీతో బెదిరించిన కేసులో ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు పట్టణానికి చెందిన బేకరీ వ్యాపారి వెంకటేశ్వరెడ్డికి షేక్ మహమ్మద్ ఇషాక్ పటేల్ బిస్కెట్లను సరఫరా చేస్తుంటాడు. కాగా ఇదే విషయమై వారిద్దరి మధ్య వివాదం జరిగింది. దీంతో ఇషాక్ పటేల్, మహమ్మద్ కరీంతో కలసి వారం క్రితం వెంకటేశ్వరెడ్డిని తుపాకీతో బెదిరించాడు. ఈ కేసులో శుక్రవారం ఇషాక్ పటేల్, కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ రివాల్వర్, ఎయిర్గన్లను స్వాధీనం చేసుకున్నారు. -
పేలిన ఎయిర్‌గన్.. బాలుడి చెంపలోకి బుల్లెట్
నర్సింహులపేట(వరంగల్ జిల్లా): పిల్లలు ఎయిర్ గన్‌తో సరదాగా ఆడుకుంటుండగా అది మిస్ ఫైర్ అయింది. దీంతో ఓ బాలుడి చెంపలోకి బుల్లెట్ దూసుకెళ్లిన సంఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దముప్పారంలో శుక్రవారం జరిగింది. గ్రామంలో సర్పంచ్ వెలుగు ఉపేందర్ కుమారుడు ప్రేమ్‌సాయి, విద్యుత్ శాఖలో పని చేస్తున్న పులిగుజ్జ సైదులు కుమారుడు మనోజ్‌లు స్నేహితులు. వీరు శుక్రవారం సర్పంచ్ వెలుగు ఉపేందర్ ఇంట్లో ఆడుకుంటున్నారు. సరదాగా ఇంట్లో గోడకు తగిలించి ఉన్న ఎయిర్‌గన్ తీసుకొని ప్రేమ్‌సాయి ఆడుతుండగా, మిస్‌ఫైర్ అయి ఎదురుగా ఉన్న మనోజ్ చెంపలోకి బుల్లెట్ దూసుకుపోయింది. మనోజ్‌ను చికిత్స నిమిత్తం తొర్రూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌గన్‌తో యువకుడు హల్చల్