దోహా: ఇప్పటికే ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత స్టార్ షూటర్ సౌరభ్ చౌదరి.. ఆసియా చాంపియన్‌షిప్‌లో మరో పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సౌరభ్ రజత పతకం సాధించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలతో మెరిసిన సౌరభ్.. ఆసియా చాంపియన్‌షిప్‌లో 244.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక్కడ పసిడి పతకాన్ని ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సాంగ్ గుక్ గెలుచుకున్నాడు.
ఫైనల్ పోరులో కిమ్ సాంగ్ 246.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. ఇరాన్‌కు చెందిన ఫరూఘి జావెద్ 221.8 పాయింట్లతో కాంస్య సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సౌరభ్‌తో పాటు అభిషేక్ వర్మ కూడా ఫైనల్‌కు అర్హత సాధించినా ఐదో స్థానంతోనే సంతృప్తి చెందాడు. ఎనిమిది మంది పాల్గొన ఫైనల్లో అభిషేక్ 181.5 పాయింట్లు నమోదు చేశాడు. కాగా, అభిషేక్ వర్మ కూడా ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment