Asian Shooting
-
ధనుశ్, ఆయుష్ పసిడి గురి
దోహా (ఖతర్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరీ రజత పతకం గెల్చుకున్నాడు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 17 ఏళ్ల షూటర్... ఫైనల్లో 244.5 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన కిమ్ సాంగ్ గుక్ 246.5 పాయిం ట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. జావేద్ (ఇరాన్–221.8 పాయింట్లు) కాంస్యం సాధించాడు. మరోవైపు ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్లు ధనుశ్ శ్రీకాంత్, ఆయుష్ రుద్రరాజు పసిడి పతకాలతో మెరిశారు. భారత షూటింగ్ జట్టులో ఎంపికైన తొలి బధిర షూటర్‌గా గుర్తింపు పొందిన 16 ఏళ్ల ధనుశ్... శ్రేయ అగర్వాల్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచాడు. ఫైనల్లో ధనుశ్–శ్రేయ ద్వయం 16–14తో వాంగ్ జెరు–జియాంగ్ జువాన్లె (చైనా) జంటపై గెలిచింది. జూనియర్ పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్లో ఆయుష్ రుద్రరాజు, గుర్నిహాల్ సింగ్ గర్చా, అభయ్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 343 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో గుర్నిహాల్ రజత పతకాన్ని సాధించాడు. -
ఆసియా చాంపియన్‌షిప్‌లో సౌరభ్‌కు రజతం
దోహా: ఇప్పటికే ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత స్టార్ షూటర్ సౌరభ్ చౌదరి.. ఆసియా చాంపియన్‌షిప్‌లో మరో పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ రజత పతకం సాధించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలతో మెరిసిన సౌరభ్.. ఆసియా చాంపియన్‌షిప్‌లో 244.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక్కడ పసిడి పతకాన్ని ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సాంగ్ గుక్ గెలుచుకున్నాడు. ఫైనల్ పోరులో కిమ్ సాంగ్ 246.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. ఇరాన్‌కు చెందిన ఫరూఘి జావెద్ 221.8 పాయింట్లతో కాంస్య సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్‌తో పాటు అభిషేక్ వర్మ కూడా ఫైనల్‌కు అర్హత సాధించినా ఐదో స్థానంతోనే సంతృప్తి చెందాడు. ఎనిమిది మంది పాల్గొన ఫైనల్లో అభిషేక్ 181.5 పాయింట్లు నమోదు చేశాడు. కాగా, అభిషేక్ వర్మ కూడా ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. -
భారత్ తీన్మార్
దోహా (ఖతర్): ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆదివారం భారత షూటర్లు అద్భుతమే చేశారు. ఏకంగా మూడు ఒలింపిక్ బెర్త్‌లను సొంతం చేసుకున్నారు. పురుషుల స్కీట్ విభాగంలో అంగద్ సింగ్ బాజ్వా స్వర్ణం, మేరాజ్ అహ్మద్ ఖాన్ రజతం సాధించి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ కాంస్య పతకం నెగ్గి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. తాజా ప్రదర్శనతో భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధికంగా 15 మంది షూటర్లు బరిలోకి దిగనున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో 12 మంది... 2012 లండన్ ఒలింపిక్స్‌లో 11 మంది భారత షూటర్లు పాల్గొన్నారు. ►స్కీట్ విభాగం క్వాలిఫయింగ్‌లో 44 ఏళ్ల మేరాజ్ నాలుగో స్థానంలో, 23 ఏళ్ల అంగద్ ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరారు. ఆరుగురు పాల్గొన్న ఫైనల్లో నిరీ్ణత 60 షాట్ల తర్వాత అంగద్, మేరాజ్ 56 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచారు. దాంతో ఇద్దరి మధ్య షూట్ ఆఫ్‌ను నిర్వహించగా... అంగద్ 6 పాయింట్లు సాధించి స్వర్ణం ఖాయం చేసుకోగా... 5 పాయింట్లు స్కోరు చేసిన మేరాజ్‌కు రజతం దక్కింది. ►పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ 449.1 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలిచాడు. ఐశ్వర్య ప్రతాప్, చెయిన్ సింగ్, పారుల్ కుమార్‌లతో కూడిన భారత జట్టుకు టీమ్ విభాగంలో కాంస్యం లభించింది. ►10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో మను భాకర్–అభిõÙక్ వర్మ జంట 16–10తో భారత్‌కే చెందిన సౌరభ్–యశస్విని జోడీపై గెలిచి పసిడి పతకం సాధించింది. ►10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్–సరబ్‌జ్యోత్ సింగ్ (భారత్) ద్వయం 16–10తో మిన్సియో కిమ్–యున్హో సుంగ్ (కొరియా) జోడీని ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. -
షూటింగ్లో మరో ‘టోక్యో’ బెర్త్
దోహా (ఖతర్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల చింకీ యాదవ్ ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటివరకు 11 మంది భారత షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. శుక్రవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో చింకీ యాదవ్ 588 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మంది షూటర్లలో నలుగురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ ఈవెంట్లో నాలుగు బెర్త్‌లు మిగిలి ఉండటంతో... ఫైనల్లో చింకీ యాదవ్ 116 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచినప్పటికీ తుది ఫలితంతో సంబంధం లేకుండా ఆమెతోపాటు మరో ముగ్గురు షూటర్లకు (థాయ్‌లాండ్–2, మంగోలియా–1) ‘టోక్యో’ బెర్త్ ఖాయమైంది. మరోవైపు ఇదే టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో తేజస్విని సావంత్, అంజుమ్ మౌద్గిల్, కాజల్ సైని (1864.8 పాయింట్లు) బృందం స్వర్ణం నెగ్గగా... పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ టీమ్ విభాగంలో సంజీవ్ రాజ్‌పుత్, శుభాంకర్, తరుణ్ యాదవ్ (1865.1 పాయింట్లు) బృందం రజతం గెల్చుకుంది. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఉదయ్‌వీర్ సిద్ధూ (577 పాయింట్లు) రజతం సాధించగా... ఉదయ్‌వీర్, విజయ్‌వీర్, గుర్ప్రీత్ సింగ్ బృందం 1710 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకుంది. -
మళ్లీ మెరిసిన మను
న్యూఢిల్లీ: భారత యువ షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరీలు మళ్లీ స్వర్ణంపై గురి పెట్టారు. చైనీస్ తైపీలో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు తమ పసిడి పతకాల్ని డబుల్ చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో మను భాకర్ బంగారు పతకం నెగ్గింది. క్వాలిఫయింగ్‌లో 575 పాయింట్లు స్కోరు చేసిన మను... ఫైనల్లో 239 పాయింట్లు సాధించింది. షి హో చింగ్ (హాంకాంగ్–237.9 పాయింట్లు) రజతం... అలాలీ వఫా (యూఏఈ– 216.8 పాయింట్లు) కాంస్యం సాధించారు. మను భాకర్, శ్రీనివేత, అనురాధాలతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1702 పాయింట్లతో కాంస్యం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌టీమ్ ఈవెంట్లో సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ, రవీందర్‌లతో కూడిన భారత బృందం స్వర్ణం గెల్చుకుంది. భారత బృందం మొత్తం 1742 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. సౌరభ్, అభిషేక్ వర్మ, రవీందర్ ఫైనల్ చేరుకోగా... అభిషేక్ వర్మ (240.7 పాయింట్లు) రజతం సాధించాడు. సౌరభ్ నాలుగో స్థానంలో, రవీందర్ సింగ్ ఏడో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు భారత్ ఐదు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం గెలిచింది. -
నాన్నకు ప్రేమతో...
ప్రతికూల పరిస్థితుల్లోనూ తప్పని గురి ఆసియా షూటింగ్లో పతకాలు నెగ్గిన హైదరాబాదీ షూటర్ రష్మీ రాథోడ్ విజయగాథ హైదరాబాద్ : ఏడేళ్లుగా షూటింగ్లో నిలకడగా రాణింపు... జాతీయ స్థాయిలో 14 పతకాలు... అయితే ఆశించిన ‘పెద్ద’ విజయం మాత్రం ఇంకా దక్కలేదు. ఏడాది క్రితం త్రుటిలో కోల్పోయిన ఆ పతకాన్ని ఈ సారి దక్కించుకోవాలని ఆమె పట్టుదలగా శ్రమించింది. అన్ని విధాలుగా పోటీలకు సిద్ధమైంది. ఇంతలో పెద్ద కుదుపు... తన చేతికి తుపాకీ అందించి మార్గదర్శిగా నిలిచిన తండ్రి హఠాన్మరణం! మరో పక్షం రోజుల్లో ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు వెళ్లాల్సి ఉంది. కానీ తన ఆటపై సందేహాలు. అయితే చివరకు ఆమె బాధను దిగమింగి ఆడేందుకే సిద్ధమైంది. కజకిస్తాన్‌లో జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన రష్మీ రాథోడ్ సత్తా చాటింది. స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణపతకం సాధించిన రష్మీ... మహిళల టీమ్ ఈవెంట్లో రజతం కూడా గెలుచుకుంది. అయితే ఈ విజయానందాన్ని చూసేందుకు తండ్రి మాత్రం లేరు. ‘పోటీ ముగిసిన తర్వాత ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ. నాకు అన్ని విధాలా నాన్నే స్ఫూర్తిగా నిలిచారు. ఈ విజయం ఆయనకు అంకితం. ఆయన ఉండి ఉంటే చాలా సంతోషించేవారు’ అని రష్మీ ఉద్వేగంగా చెప్పింది. తుపాకులు, కత్తులు... రష్మీ తండ్రి వైఎస్ రాథోడ్ ఆర్మీలో కెప్టెన్‌గా పని చేశారు. దాంతో సహజంగానే తుపాకులపై ఆసక్తి పెరిగింది. అయితే అది ఎంతగా అంటే ఆమె ఆట వస్తువుల్లో గన్స్, డాగర్స్ తప్ప మరొకటి లేదు. అమ్మాయిలు ఇష్టపడే బార్బీలాంటి బొమ్మలతో అసలు తానెప్పుడూ ఆడుకోనే లేదు. అయితే ప్రొఫెషనల్‌గా షూటింగ్లో వెళ్లాలని రష్మీ కూడా అనుకోలేదు. 2005లో చదువు పూర్తి చేసిన తర్వాతనే ఆమె ఆసక్తి దీని వైపు మళ్లింది. ఆ సమయంలో గచ్చిబౌలి రేంజ్లో జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ చూసేందుకు నాన్నతో పాటు వెళ్లింది. అదే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. వచ్చే ఏడాది నువ్వు కూడా ఈ పోటీల్లో పాల్గొనాలంటూ ప్రోత్సహించిన తండ్రి, అందు కోసం తగిన రీతిలో అక్కడే శిక్షణ ఇప్పించారు. అయితే షాట్‌గన్ ప్రాక్టీస్‌లో ‘రీ కాయిల్’ (బుల్లెట్ ఫైర్ చేశాక వచ్చే కుదుపు) చాలా ఎక్కువగా ఉండటంతో ఆరంభంలో గాయాలపాలైంది. కానీ పట్టుదలతో ఫిట్నెస్ను పెంచుకొని తీవ్రంగా సాధన చేసింది. ఆ తర్వాత మూడేళ్ల పాటు నిలకడగా రాణించిన రష్మీ, 2008లో భారత షూటింగ్ జట్టులో భాగంగా మారింది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో 6 స్వర్ణాలు, 6 రజతాలు, 2 కాంస్యాలు గెలుచుకుంది. గురి కుదిరింది... రెండేళ్ల క్రితం భారత కోచ్‌గా ఎనియో ఫాల్కో వచ్చిన తర్వాత రష్మీ షూటింగ్ మరింత మెరుగైంది. భారత క్యాంప్‌లో తన లోపాలు సరిదిద్దుకుంటూ మంచి ఫలితాలు సాధించింది. గత ఏడాది కువైట్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 67/75 స్కోర్ చేసిన ఆమె పతకం సాధించడంలో విఫలమైంది. ఆ తర్వాత షూటర్లకు అవసరమైన మానసిక బలం కోసం స్పోర్ట్స్ సైకాలజిస్ట్ వైభవ్ అగషే సహాయం తీసుకోవడం రష్మీని దృఢంగా మార్చింది. సంవత్సరం తర్వాత తగిన ఫలితాన్నిచ్చింది. కజకిస్తాన్ ఈవెంట్లో సింగిల్స్ విభాగంలో కూడా రష్మీ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయింది. రష్మీ తల్లి ఆనీ మ్యాథ్యూ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో భారత రాయబార కార్యాలయంలో ప్రొటోకాల్ అధికారిణిగా పని చేస్తోంది. స్కూల్ నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్‌లోనే చదివిన రష్మీ నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో అకౌంటింగ్స్ అండ్ కంట్రోల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 34 ఏళ్ల రష్మి ప్రస్తుతం చదువు, ఉద్యోగంలాంటివి పక్కన పెట్టి పూర్తిగా షూటింగ్‌పైనే దృష్టి పెట్టి పెద్ద లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో ఉంది. కజకిస్తాన్‌లో సాధించిన పతకాలు నా కెరీర్లో మేలిమలుపు. 17 డిగ్రీల చలి వాతావరణంలో, గాలి దిశ మార్చుకుంటున్న ప్రతికూల వాతావరణంలో విజయం సాధించడం నా ఆటపై పెరిగిన పట్టుకు నిదర్శనం. ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. త్వరలో మాస్కోలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సిద్ధమవుతున్నా. అక్కడ పోటీ చాలా ఉంటుంది. ఈ టోర్నీలో విజయం సాధించగలిగితే చాలా గొప్ప ఘనత అవుతుంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే నా లక్ష్యానికి అది చేరువ చేస్తుందని నా నమ్మకం. కేవలం షూటింగ్ అంటే పిచ్చి వల్లే నేను ఆటలో కొనసాగుతున్నాను. విజయాలకు అడ్డు కావద్దని పెళ్లి తదితర వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టాను. షూటింగ్లో వయసు పెద్ద అడ్డంకి కాదు కాబట్టి నేను దానిని పట్టించుకోను. – రష్మీ రాథోడ్, షూటర్