
ఫైనల్లో అభిషేక్ వర్మ
ప్రపంచకప్ ఆర్చరీ
వ్రోక్లా (పోలండ్): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నమెంట్‌లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అభిషేక్ 146-145తో స్టీవ్ అండర్సన్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో 147-143తో మెన్సియెని (ఇటలీ)పై గెలి చాడు. స్వర్ణ పతకం కోసం అతను ఇరాన్ ప్లేయర్ ఇస్మాయిల్ ఇబాదీతో తలపడతాడు. మరోవైపు అభిషేక్ వర్మ, కవల్‌ప్రీత్ సింగ్, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు కాంపౌండ్ టీమ్ ఈవెంట్ సెమీస్‌లో 231-232తో అమెరికా చేతిలో ఓడింది. దీంతో కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంది.