
బర్మింగ్‌హామ్ (అమెరికా): వరల్డ్ గేమ్స్ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో... శనివారం జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ కాంస్య పతకం సాధించింది.
వరల్డ్ గేమ్స్ ఆర్చరీ చరిత్రలో భారత్‌కిదే తొలి పతకం కావడం విశేషం. కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 157–156తో ఆండ్రియా బెసెరా–మిగెల్ బెసెరా (మెక్సికో) జంటపై గెలిచింది.