World Archery Tournament
-
World Games 2022: సురేఖ జంటకు కాంస్యం
బర్మింగ్‌హామ్ (అమెరికా): వరల్డ్ గేమ్స్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత్ పతకాల బోణీ చేసింది. అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో... శనివారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ కాంస్య పతకం సాధించింది. వరల్డ్ గేమ్స్ ఆర్చరీ చరిత్రలో భారత్‌కిదే తొలి పతకం కావడం విశేషం. కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 157–156తో ఆండ్రియా బెసెరా–మిగెల్ బెసెరా (మెక్సికో) జంటపై గెలిచింది. -
ప్రపంచ ఆర్చరీ పోటీలకు జ్యోతి సురేఖ
సాక్షి, విజయవాడ: వచ్చే నెలలో కొలంబియాలో, ఆ తర్వాత టర్కీలో జరిగే ఆర్చరీ ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పాల్గొనే భారత మహిళల కాంపౌండ్ జట్టులోకి ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఎంపికైంది. భువనేశ్వర్‌లో జరిగిన ట్రయల్స్‌లో ఈ విజయవాడ ఆర్చర్ నంబర్‌వన్‌గా నిలిచింది. తద్వారా రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లతో పాటు జూన్‌లో నెదర్లాండ్స్ ఆతిథ్యమిచ్చే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా ఈ తెలుగు అమ్మాయి భారత్ జట్టులో బెర్త్ సంపాదించింది. ర్యాంకింగ్ రౌండ్లో సురేఖ 2880 పాయింట్లకుగాను 2801 పాయింట్లు స్కోరు చేసింది. -
అతాను-దీపిక జంటకు రజతం
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లో అతాను దాస్-దీపిక కుమారిలతో కూడిన భారత జోడీ రజత పతకాన్ని సాధించింది. ఆదివారం జరిగిన రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో అతాను దాస్-దీపిక ద్వయం 1-5 తేడాతో కు బొన్‌చాన్-మిసున్ చోయ్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. సెట్ల పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఒక్కో జంటకు నాలుగేసి బాణాలు సంధించే అవకాశాన్ని కల్పిస్తారు. సెట్ నెగ్గిన వారికి రెండు పాయింట్లు ఇస్తారు. స్కోరు సమమైతే ఒక్కో పాయింట్ లభిస్తుంది. తొలి సెట్‌ను కొరియా 36-33తో నెగ్గి 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో సెట్లో 36-36తో స్కోరు సమంగా నిలిచింది. దాంతో కొరియా ఆధిక్యం 3-1కి పెరిగింది. మూడో సెట్‌ను కొరియా 38-37తో గెలిచి 5-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో నాలుగో సెట్‌ను నిర్వహించలేదు. అంతకుముందు మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 1-5తో ఇటలీ జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. -
పసిడి పోరుకు అర్హత
► టీమ్ ఫైనల్లో భారత మహిళల జట్టు ► ప్రపంచకప్ ఆర్చరీ షాంఘై (చైనా): వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన భారత మహిళా ఆర్చర్లు జట్టుగా మాత్రం రాణించారు. దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి మాఝీలతో కూడిన భారత జట్టు ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లో రికర్వ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 5-3తో టాప్ సీడ్ జర్మనీ జట్టును బోల్తా కొట్టించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 5-4తో చైనాపై గెలుపొందగా... తొలి రౌండ్లో 6-0తో అమెరికాను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుతో దీపిక బృందం పోటీపడుతుంది. మరోవైపు పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో మంగళ్ సింగ్ చంపియా, అతాను దాస్, జయంత తాలుక్దార్లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం కోసం ఆడనుంది. సెమీఫైనల్లో భారత్ 4-5తో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఆదివారం జరిగే కాంస్య పతక పోటీలో బ్రిటన్‌తో భారత్ తలపడుతుంది.