ప్రపంచ ఆర్చరీ పోటీలకు జ్యోతి సురేఖ  | Jyoti Surekha for World Archery Tournament | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఆర్చరీ పోటీలకు జ్యోతి సురేఖ 

Published Tue, Mar 19 2019 1:15 AM | Last Updated on Tue, Mar 19 2019 1:15 AM

Jyoti Surekha for World Archery Tournament - Sakshi

సాక్షి, విజయవాడ: వచ్చే నెలలో కొలంబియాలో, ఆ తర్వాత టర్కీలో జరిగే ఆర్చరీ ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌లలో పాల్గొనే భారత మహిళల కాంపౌండ్‌ జట్టులోకి ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ ఎంపికైంది. భువనేశ్వర్‌లో జరిగిన ట్రయల్స్‌లో ఈ విజయవాడ ఆర్చర్‌ నంబర్‌వన్‌గా నిలిచింది.

తద్వారా రెండు ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లతో పాటు జూన్‌లో నెదర్లాండ్స్‌ ఆతిథ్యమిచ్చే ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు కూడా ఈ తెలుగు అమ్మాయి భారత్‌ జట్టులో బెర్త్‌ సంపాదించింది. ర్యాంకింగ్‌ రౌండ్‌లో సురేఖ 2880 పాయింట్లకుగాను 2801 పాయింట్లు స్కోరు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement