vennam Jyoti surekha
-
Antalya: జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
అంటాల్యా (తుర్కియే): భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్లో శుభారంభం చేసింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో ఆమె క్వాలిఫయింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు మరో ప్రపంచ రికార్డును సమం చేసింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ మొత్తం 713 పాయింట్లు స్కోరు చేసింది. 2015లో సారా లోపెజ్ (కొలంబియా) 713 పాయింట్లతో నమోదు చేసిన ప్రపంచ రికార్డును సురేఖ సమం చేసింది. అంతేకాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 2017లో కొరియా ఆర్చర్ 709 పాయింట్లతో నమోదు చేసిన రికార్డును సురేఖ సవరించింది. క్వాలిఫయింగ్‌లో ఒక్కో ఆర్చర్ 72 బాణాలు సంధించాలి. తొలి రౌండ్లో 36, రెండో రౌండ్లో మరో 36 బాణాలు సంధిస్తారు. తొలి రౌండ్లో జ్యోతి సురేఖ 353 పాయింట్లు... రెండో రౌండ్లో 360 పాయింట్లు సాధించింది. రెండో రౌండ్లో జ్యోతి సురేఖ కొట్టిన 36 బాణాలు 10 పాయింట్ల సర్కిల్‌లోకి వెళ్లడం విశేషం. దాంతో ఆమె అందుబాటులో ఉన్న మొత్తం 360 పాయింట్లను తన ఖాతాలోకి వేసుకుంది. ఈ క్రమంలో జ్యోతి సురేఖ 360కి 360 పాయింట్లు స్కోరు చేసిన తొలి మహిళా ఆర్చర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రదర్శనతో 2015 నుంచి సారా లోపెజ్ (356 పాయింట్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. ‘ప్రపంచ రికార్డు సాధిస్తానని ఊహించలేదు. ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన. టాప్ సీడ్‌తో మెయిన్ రౌండ్లో బరిలోకి దిగనుండటం సంతోషంగా ఉంది. ఎలిమినేషన్ రౌండ్లలోనూ పూర్తి ఏకాగ్రతతో పోటీపడతాను’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన సురేఖకు ఎలిమినేషన్ రౌండ్లలో టాప్ సీడ్ దక్కింది. భారత్‌కే చెందిన అదితి, అవ్నీత్ కౌర్ స్కోర్ల ఆధారంగా క్వాలిఫయింగ్ టీమ్ విభాగంలో భారత్ 2,112 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ఆడుతున్న సురేఖ అంతర్జాతీయ టోర్నీలలో 30 కంటే ఎక్కువ పతకాలు సాధించింది. -
World Games 2022: సురేఖ జంటకు కాంస్యం
బర్మింగ్‌హామ్ (అమెరికా): వరల్డ్ గేమ్స్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత్ పతకాల బోణీ చేసింది. అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో... శనివారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ కాంస్య పతకం సాధించింది. వరల్డ్ గేమ్స్ ఆర్చరీ చరిత్రలో భారత్‌కిదే తొలి పతకం కావడం విశేషం. కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 157–156తో ఆండ్రియా బెసెరా–మిగెల్ బెసెరా (మెక్సికో) జంటపై గెలిచింది. -
జ్యోతి సురేఖ పునరాగమనం
తొలి రెండు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టులో చోటు సంపాదించలేకపోయిన ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ సెలెక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటుకొని మళ్లీ భారత జట్టులోకి వచ్చింది. సోనెపట్‌లో భారత ఆర్చరీ సంఘం నిర్వహించిన జ్యోతి సురేఖ రాణించి జూన్ 21 నుంచి 26 వరకు పారిస్‌లో జరిగే ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీకి, జూలై 7 నుంచి 17 వరకు అమెరికాలో జరిగే వరల్డ్ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టులో స్థానం దక్కించుకుంది. -
Jyothi Surekha: సూపర్ సురేఖ
అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్íÙప్లో తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ గురి అదిరింది. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ భారత్‌కు మూడు రజత పతకాలను అందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ విభాగంలో, మహిళల టీమ్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. యాంక్టన్ (అమెరికా): అంతర్జాతీయ వేదికపై మరోసారి తన సత్తా చాటుకున్న తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ చాంపియన్íÙప్లో మెరిసింది. మూడు స్వర్ణ పతకాలపై గురి పెట్టిన సురేఖ కీలకదశలో తడబడి చివరకు మూడు రజత పతకాలతో సంతృప్తి పడింది. శనివారం జరిగిన కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సురేఖ రజతం సొంతం చేసుకుంది. సారా లోపెజ్ (కొలంబియా)తో జరిగిన ఫైనల్లో సురేఖ 144–146 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. ఇద్దరూ ఐదుసార్లు మూడు బాణాల చొప్పున మొత్తం 15 బాణాలను లక్ష్యంవైపు గురి పెట్టి సంధించారు. తొలి సిరీస్‌లో సారా లోపెజ్ 29, సురేఖ 28... రెండో సిరీస్‌లో సారా 29, సురేఖ 29... మూడో సిరీస్‌లో సారా 30, సురేఖ 29... నాలుగో సిరీస్‌లో సారా 29, సురేఖ 28... ఐదో సిరీస్‌లో సారా 29, సురేఖ 30 పాయింట్లు స్కోరు చేశారు. చివరకు రెండు పాయింట్ల తేడాతో సారా లోపెజ్ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. అంతకుముందు సెమీఫైనల్లో సురేఖ 148–146తో ఆండ్రియా బెసెరా (మెక్సికో)పై, క్వార్టర్ ఫైనల్లో 150–144తో అమందా మ్లినారిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. మ్లినారిచ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సురేఖ 150కి 150 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో లిండా అండర్సన్ (అమెరికా; 2018లో), సారా లోపెజ్ (కొలంబియా; 2013, 2021లో) మాత్రమే 150కి 150 పాయింట్లు స్కోరు చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంపౌండ్ మహిళల టీమ్ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్లతో కూడిన భారత జట్టు 224–229 పాయింట్ల తేడాతో సారా లోపెజ్, అలెజాంద్రా ఉస్కియానో, నోరా వాల్దెజ్‌లతో కూడిన కొలంబియా జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. మరోవైపు మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిõÙక్ వర్మ (భారత్) జంట ఫైనల్లో 150–154 పాయింట్ల తేడాతో సారా లోపెజ్–డానియల్ మునోజ్ (కొలంబియా) జోడీ చేతిలో పరాజయంపాలైంది. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో సురేఖ గెలిచిన పతకాలు. 2017లో టీమ్ విభాగంలో రజతం, 2019లో టీమ్ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించింది. 2021లో మూడు రజతాలు గెలిచింది. తన పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో జ్యోతి సురేఖ 41 అంతర్జాతీయ టోర్నీలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి మొత్తం 36 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 16 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. -
స్వర్ణ సురేఖ
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): అంతర్జాతీయస్థాయిలో ఈ ఏడాది ఆద్యంతం నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో మరో గొప్ప ఘనత జమ చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగం మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖఅభిషేక్ వర్మ (భారత్) జంట 158151 పాయింట్ల తేడాతో యి సువాన్ చెన్చియె లున్ చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. ఫైనల్లో ఒక్కో జోడీకి లక్ష్యంవైపు 16 బాణాల చొప్పున అవకాశం ఇచ్చారు. విజయవాడకు చెందిన 23 ఏళ్ల జ్యోతి సురేఖ తాను సంధించిన ఎనిమిది బాణాలకు గరిష్టంగా లభించే 80 పాయింట్లను సాధించడం విశేషం. ఆమె సంధించిన ఎనిమిది బాణాలూ 10 పాయింట్ల వృత్తంలోకి వెళ్లాయి. అభిషేక్ వర్మ 80 పాయింట్లకుగాను 78 పాయింట్లు స్కోరు చేశాడు. ‘ఆసియా చాంపియన్‌షిప్‌లో ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. గాలి బాగా వీస్తున్నా స్వర్ణం నెగ్గే ఆఖరి అవకాశాన్ని వదులుకోలేదు’ అని సురేఖ వ్యాఖ్యానించింది. అంతకుముందు జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని గెల్చుకుంది. ఫైనల్లో భారత జట్టు 215231తో చెవన్ సో, యున్ సూ సాంగ్, డేయోంగ్ సియోల్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టుకు కూడా రజతం లభించింది. ఫైనల్లో భారత జట్టు 232233తో కేవలం పాయింట్ తేడాతో జేవన్ యాంగ్, యోంగ్హి చోయ్, యున్ క్యు చోయ్లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో పరాజయం పాలైంది. బుధ వారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో కలిపి భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు లభించాయి. గురువారం ఇదే వేదికపై టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 2: కాంపౌండ్ విభాగంలో ఇప్పటివరకు పది ఆసియా చాంపియన్‌షిప్‌లు జరిగాయి. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ జంట స్వర్ణం నెగ్గడం ఇది రెండోసారి. 2013లో అభిషేక్ వర్మలిల్లీ చాను ద్వయం తొలి పసిడి పతకం గెలిచింది. 3: ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో జ్యోతి సురేఖ నెగ్గిన స్వర్ణాల సంఖ్య. సురేఖ 2015లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, 2017లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో పసిడి పతకాలు సాధించింది. 30: తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో జ్యోతి సురేఖ సాధించిన పతకాలు. ఇందులో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. -
కాంస్య పతక పోరుకు జ్యోతి సురేఖ
మహిళల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ విశేషంగా రాణించింది. ఆమె రెండు కాంస్య పతకాల కోసం పోటీపడనుంది. జ్యోతి సురేఖ, ముస్కాన్, రాజ్ కౌర్‌లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు సెమీఫైనల్లో 226–227తో అమెరికా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్లో బై పొందిన భారత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 236–226తో ఫ్రాన్స్‌పై... క్వార్టర్ ఫైనల్లో 219–213తో నెదర్లాండ్స్‌పై గెలిచింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో టర్కీతో భారత్ ఆడుతుంది. మరోవైపు వ్యక్తిగత విభాగంలోనూ జ్యోతి సురేఖ కాంస్యం కోసం బరిలో ఉంది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ 140–143తో పియర్స్ పైజి (అమెరికా) చేతిలో ఓడిపోయింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో యాసిమ్ బోస్టాన్ (టర్కీ)తో సురేఖ ఆడుతుంది. సురేఖ క్వార్టర్ ఫైనల్లో 147–141తో సారా ప్రీల్స్ (బెల్జియం)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లో తాంజా జెన్సన్ (డెన్మార్క్)పై, మూడో రౌండ్లో 146–143తో బోమిన్ చోయ్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. -
‘శాఫ్’ క్రీడలకు సురేఖ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ వచ్చేనెల లో జరిగే దక్షిణాసియా (శాఫ్) క్రీడల కు అర్హత సాధించింది. మేఘాలయాలోని షిల్లాంగ్‌లో బుధవారం ముగి సిన సెలక్షన్ ట్రయల్స్‌లో రాణించిన సురేఖ భారత మహిళల కాంపౌండ్ జట్టులోకి ఎంపికైంది. ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు అస్సాంలోని గౌహతిలో ‘శాఫ్’ క్రీడలు జరుగుతాయి. -
సురేఖ జోడీకి రజతం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విశ్వ విద్యాలయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రజత పతకం సొంతం చేసుకుంది. కొరియాలోని గ్వాంగ్జౌలో జరుగుతున్న ఈ పోటీల మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సురేఖ జోడీకి రెండో స్థానం దక్కింది. ఫైనల్లో భారత జంట సురేఖ-కన్వల్ ప్రీత్ సింగ్ 150-157 స్కోరుతో దక్షిణ కొరియా ద్వయం చేతిలో పరాజయం పాలైంది.