
ఆర్చరీ రికర్వ్, కాంపౌండ్ మిక్స్‌డ్ విభాగాల్లో భారత పోరు ముగిసింది. మిక్స్‌డ్ కాంపౌండ్ విభాగంలో ఈ ఏడాది వరుసగా నాలుగు ప్రపంచకప్‌లలో కాంస్య పతకాలు సాధించి జోరు మీదున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట ఆసియా క్రీడల్లో మాత్రం విఫలమైంది.
క్వార్టర్ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జంట 153–155తో గొర్బానీ–మహబూబీ (ఇరాన్) ద్వయం చేతిలో ఓడింది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి–అతాను దాస్ జంట క్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లో 4–5తో బిషిండి–బాతర్‌ఖుయా (మంగోలియా) జోడీ చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment