
షాంఘై (చైనా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌడ్ వ్యక్తిగత విభాగం రెండో రౌండ్‌లో సురేఖ 145–140తో లెక్సీ కెల్లర్ (అమెరికా)పై విజయం సాధించింది.