
ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన కెరీర్‌లోనే ఉత్తమ ర్యాంక్‌ను అందుకుంది. ప్రపంచ ఆర్చరీ తాజా ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సురేఖ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. తద్వారా కాంపౌండ్ విభాగంలో అత్యుత్తమ ర్యాంక్ అందుకున్న భారతీయ ఆర్చర్‌గా ఆమె గుర్తింపు పొందింది. విజయవాడకు చెందిన 25 ఏళ్ల సురేఖ ఇటీవల ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment