ఆసియా గ్రాండ్‌ప్రికి జ్యోతి సురేఖ | Asian grandpri Jyothi Surekha | Sakshi
Sakshi News home page

ఆసియా గ్రాండ్‌ప్రికి జ్యోతి సురేఖ

Feb 17 2014 1:11 AM | Updated on Sep 2 2017 3:46 AM

ఆసియా గ్రాండ్‌ప్రికి జ్యోతి సురేఖ

ఆసియా గ్రాండ్‌ప్రికి జ్యోతి సురేఖ

జాతీయ సీనియర్ మహిళల ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటింది.

జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో రాణింపు
 సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ మహిళల ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటింది. న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ ర్యాంకింగ్ రౌండ్‌లో జ్యోతి సురేఖ మొదటి స్థానంలో నిలిచింది. కాంపౌండ్ విభాగంలో మొత్తం 720 పాయింట్లకు గాను ఆమె 692 పాయింట్లు స్కోర్ చేసింది. సురేఖ కెరీర్‌లో ఇదే బెస్ట్ స్కోర్ కావడం విశేషం.
 
 అనంతరం జరిగిన రెండు ఒలింపిక్ రౌండ్ విభాగాల్లో తొలి, ఐదో స్థానం అందుకున్న సురేఖ ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచింది. తాజా ప్రదర్శనతో ఆమె ఆసియా గ్రాండ్ ప్రి టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది. మార్చి 10-15 వరకు బ్యాంకాక్‌లో ఈ ఈవెంట్ జరుగుతుంది. మరోవైపు పురుషుల కాంపౌండ్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన రాష్ట్ర ఆర్చర్ వై. చరణ్ రెడ్డి కూడా గ్రాండ్‌ప్రి టోర్నీకి అర్హత సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement