
రెండో రౌండ్‌లో జ్యోతి సురేఖ
బ్యాంకాక్: ఆసియా కప్ ప్రపంచ ర్యాంకింగ్
స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం తొలి రౌండ్‌లో జ్యోతి సురేఖ 145–131తో బిబిగుల్ ఇజ్బాసరోవా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. గురువారం జరిగే రెండో రౌండ్‌లో నూర్ రిజా ఇషాక్ (మలేసియా)తో జ్యోతి సురేఖ తలపడుతుంది. కాంపౌండ్ టీమ్ విభాగంలో సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ లభించింది.