![Andhra Pradesh Ministers Felicitate Gold Medal Winner Jyothi Surekha - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/22/nani.jpg.webp?itok=8QFlBjOT)
సాక్షి, అమరావతి: నెదర్లాండ్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకం సాధించిన వెన్నం జ్యోతిసురేఖను మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఘనంగా సన్మానించారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విలువిద్యలో పతకాలు సాధించిన జ్యోతిసురేఖ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు.
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, జ్యోతిసురేఖ క్రీడల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లాకు చెందిన సురేఖ ఆర్చరీలో పతకం సాధించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారన్నారు. సురేఖను క్రీడల పట్ల ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా అభినందించడం సముచితమన్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత వెన్నం జ్యోతిసురేఖ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో పతకాలు సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో 32 స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించానని చెప్పారు. భవిష్యత్‌లో జరగబోయే మరిన్ని అంతర్జాతీయ వేదికలపై బంగారు పతకం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని పేర్నొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment