Gold medallist
-
ఫైనల్‌కు ముందు నీరజ్ జావెలిన్‌ను ఆ పాకిస్తానీ ఎందుకు తీసుకెళ్లాడు?
ముంబై: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన విషయం తెలిసిందే. అయితే కీలకమైన ఫైనల్‌కు ముందు జరిగిన ఒక ఆసక్తికర ఘటనను టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా బయటపెట్టాడు. ఫైనల్ ప్రారంభానికి ముందు ఒక్కసారిగా నా జావెలిన్ కనిపించకుండా పోయిందని అతడు తెలిపాడు. ఎంత వెతికిన నా జావెలిన్ కనిపించలేదు. అయితే సడెన్‌గా అది పాకిస్థాన్‌కు చెందిన నదీమ్ అర్షద్ చేతుల్లో కనిపించింది. నా జావెలిన్‌తో అతడు అటూఇటూ తిరుగుతున్నాడు. అది చూసి.. భాయ్ ఆ జావెలిన్ ఇవ్వు. అది నాది. నేను ఫైనల్లో దానినే విసరాలి అని అడిగాను. దీంతో అర్షద్ దానిని తిరిగి ఇచ్చేశాడు అని నీరజ్ చెప్పాడు. ఈ గందరగోళం వల్లే తాను తన తొలి త్రోను హడావిడిగా విసరాల్సి వచ్చిందని నీరజ్ అన్నాడు. కాగా జావెలిన్ త్రో ఫైనల్లో నదీమ్ అర్షద్ 6 వ స్థానాన్ని దక్కించుకోవడానికి బాగా కష్టపడ్డాడని నీరజ్ తెలిపాడు. ఎప్పటినుంచో మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉందని అతను చెప్పాడు. చదవండి: నీరజ్ చోప్రా ముందు అసభ్యకర డ్యాన్స్‌లు; ఫ్యాన్స్ ఆగ్రహం Here we can see Neeraj asking for his Javelin to Arshad #NeerajChopra #Tokyo2020 #ArshadNadeem pic.twitter.com/FTqfGyjlrI — vishal ghandat (@VishalGhandat) August 25, 2021 -
జ్యోతి సురేఖకు సన్మానం
సాక్షి, అమరావతి: నెదర్లాండ్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకం సాధించిన వెన్నం జ్యోతిసురేఖను మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఘనంగా సన్మానించారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విలువిద్యలో పతకాలు సాధించిన జ్యోతిసురేఖ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, జ్యోతిసురేఖ క్రీడల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లాకు చెందిన సురేఖ ఆర్చరీలో పతకం సాధించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారన్నారు. సురేఖను క్రీడల పట్ల ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా అభినందించడం సముచితమన్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత వెన్నం జ్యోతిసురేఖ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో పతకాలు సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో 32 స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించానని చెప్పారు. భవిష్యత్‌లో జరగబోయే మరిన్ని అంతర్జాతీయ వేదికలపై బంగారు పతకం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని పేర్నొన్నారు. -
స్వర్ణాలు నెగ్గిన గుకేశ్, సవితశ్రీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు మెరిశారు. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్ అండర్ –12 ఓపెన్ విభాగంలో డి.గుకేశ్... బాలికల విభాగంలో సవితశ్రీ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత గుకేశ్ 10 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చెన్నైకు చెందిన 12 ఏళ్ల గుకేశ్ కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గుకేశ్ మొత్తం పది విజయాలు సాధించి, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. అండర్–12 బాలికల విభాగంలో చెన్నై అమ్మాయి సవితశ్రీ 10 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఆమె తొమ్మిది గేమ్‌ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో అండర్–8, అండర్–10, అండర్–12 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. 86 దేశాల నుంచి 861 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓవరాల్‌గా చైనా రెండు స్వర్ణాలు, కాంస్యంతో తొలి స్థానంలో నిలువగా... రెండు స్వర్ణాలతో భారత్ రెండో స్థానంలో... స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలతో అమెరికా మూడో స్థానంలో నిలిచాయి. -
రిలేలో జోరు
జకార్తా: ఆసియా క్రీడల్లో అద్భుత రికార్డును కొనసాగిస్తూ 4్ఠ400మీ. రిలే పరుగులో భారత మహిళలు వరుసగా ఐదోసారి స్వర్ణం నెగ్గారు. గురువారం జరిగిన రేసులో హిమా దాస్, ఎంఆర్ పూవమ్మ, సరితాబెన్ గైక్వాడ్, విస్మయ కరోత్లతో కూడిన భారత బృందం 3ని. 28.72 సెకన్లలో రేసును పూర్తిచేసి విజేతగా అవతరించింది. హిమా బుల్లెట్లా దూసు కెళ్లడంతో ప్రారంభం నుంచి భారత జట్టు ఆధిక్యంలో నిలిచింది. బహ్రెయిన్ (3ని. 30.61 సెకన్లు), వియా త్నాం (3ని. 33.23 సెకన్లు) వరుసగా రజతం, కాం స్యాలు సాధించాయి. 2002 ఏషియాడ్ నుంచి 4్ఠ400మీ. స్వర్ణం భారత్ ఖాతాలోనే ఉంటోంది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో భారత బృందం రజతం గెలుచుకుంది. కున్హు ముహమ్మద్, ధరుణ్ అయ్యసామి, మొహమ్మద్ అనస్, అరోకియా రాజీవ్‌లతో కూడిన బృందం 3 నిమిషాల 01.85 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. 3 నిమిషాల 0.56 సెకన్ల ఆసియా క్రీడల రికార్డుతో ఖతర్ జట్టు స్వర్ణం దక్కించుకుంది. 3 ని. 1.94 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన జపాన్ బృందం కాంస్యం అందుకుంది. గత ఏషియాడ్‌లో భారత పురుషుల రిలే జట్టు నాలుగో స్థానంతో త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. స్క్వాష్ సెమీస్ ప్రత్యర్థి మలేసియా మహిళల స్క్వాష్ జట్టు హాంకాంగ్ చేతిలో 1–2 తేడాతో పరాజయం పాలైంది. గురువారం జోయ్ చాన్ 3–1తో దీపికా పల్లికల్పై, యానీ 3–0తో జోష్నా చినప్పపై గెలుపొందారు. అయితే... సునయనా కురువిల్లా 3–2 తేడాతో జె లాక్ హొపై గెలుపొందింది. గ్రూప్ ‘బి’లో మూడు మ్యాచ్‌లు గెలిచి, ఒకదాంట్లో ఓడిన మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. సెమీస్‌లో మలేసియాతో తలపడనుంది. టీటీ ప్రిక్వార్టర్స్‌లో మనికా, శరత్, సత్యన్ టేబుల్ టెన్నిస్‌లో భారత ఆటగాళ్లు ప్రిక్వార్టర్స్‌కు చేరారు. మహిళల విభాగంలో మనికా బాత్రా 11–3, 11–7, 11–3, 11–6తో నంథానా కొమ్వాంగ్ (థాయ్‌లాండ్)ను, పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ 11–4, 11–8, 11–7, 11–5తో ముహమ్మద్ ఆసిమ్ ఖురేషి (పాకిస్తాన్)ని ఓడించారు. సత్యన్ జ్ఞాన శేఖరన్ 4–2 తేడాతో శాంటొసొపై (ఇండోనేసియా) నెగ్గాడు. 1500 మీ. పరుగులో చిత్రకు కాంస్యం మహిళల 1500 మీటర్ల పరుగులో ఆసియా చాంపియన్ అయిన చిత్ర ఉన్నికృష్ణన్ ఏషియాడ్‌లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. 4 నిమిషాల 12.56 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యంతోనే సంతృప్తి పడింది. బహ్రెయిన్ అథ్లెట్లు కల్కిదన్ బెఫ్కదు (4 ని. 07.88 సెకన్లు), టిగిస్ట్ బిలే (4 ని. 09.12 సెకన్లు) స్వర్ణం, రజతం నెగ్గారు. -
కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్‌కు చేదు అనుభవం
వారణాసి: కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి భారత కీర్తిని పతాక స్థాయికి చేర్చిన వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం వారణాసిలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పూనమ్ యాదవ్ వారణాసిలోని తమ బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పూనమ్‌తోపాటు తండ్రి, మరో ఇద్దరు బంధువులు కూడా ఉన్నారు. వాళ్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. దుండగులు వారిపైన కూడా దాడి చేశారు. రాళ్ల వర్షం కురవడంతో పోలీసులు వెంటనే పూనమ్‌ను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై వారణాసి రూరల్ ఎస్పీ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ విషయం తెలియగానే అదనపు బందోబస్తును పూనమ్ యాదవక్‌కు రక్షణగా పంపించామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడికి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టమన్నారు. గతంలో పూనమ్ యాదవ్ బంధువు, సమీప గ్రామ పెద్దకు మధ్య ఉన్న భూవివాదంలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ మహిళల 69 కేజీల విభాగంలో పూనమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. స్నాచ్‌లో 100 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 122 కేజీల బరువెత్తి ఆమె పసిడిని సొంతం చేసుకుంది. -
రాగాల వెంకట్ రాహుల్‌కు అభినందనల వెల్లువ
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా) : కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణం అందించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిస్బేన్‌లో వెంకట్ రాహుల్‌ను క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ సన్మానించింది. ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2018 వెయిట్ లిఫ్టింగ్ 85 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. తెలుగు క్రీడాకారులను ఆదరించి మరింత ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో వారు మరిన్నివిజయాలను సాధించటానికి ప్రేరణగా ఉంటుంది అని క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ సభ్యులు నవనీత తాటిమకుల, రవి కాంత్ గుండేపల్లి, కృష్ణ రావిపాటి, ఉమా గూడూరు, రత్న బుద్ధవరపు తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పనిమనిషిగా మారిన గోల్డ్ మెడలిస్ట్
చండీఘడ్: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో బంగారు పతక విజేత రిషూ మిట్టల్ స్కూలు ఫీజు చెల్లించడం కోసం పనిమనిషిగా మారిపోయింది. ఒకప్పుడు బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థులను మట్టికరిపించి విజేత గా నిలిచిన రిషూ పదవ తరగతి ఫీజు కూడా కట్టలేని పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. మేరీకోమ్ కావాలని కలలు కన్న ఈ బాక్సర్ పనిమనిషిగా మారడం సంచలనం సృష్టించింది. రిషూ మిట్టల్ కోచ్ రాజేందర్ సింగ్ అందించిన వివరాల ప్రకారం హర్యానా కైతాల్‌కు చెందిన రిషూ మిట్టల్ 2014లో స్టేట్ లెవల్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. గ్వాలియర్‌లో జరిగిన జాతీయపోటీల్లో కూడా హర్యానా తరపున ఆమె పాల్గొంది. ప్రస్తుతం ఆమె 10వ తరగతి ఫీజు కట్టలేని దయనీయ పరిస్థితిలో ఉంది. అందుకే ఆమె ఇపుడు నాలుగు ఇళ్లల్లో పాచిపని చేసుకోవడానికి సిద్ధపడింది. ఇదివరకే తల్లిదండ్రులను కోల్పోయిన మిట్టల్ అన్నయ్య కూడా ఓ చిరుద్యోగి.