తుర్కయాంజల్(రంగారెడ్డి జిల్లా): స్వాతంత్య్ర సమరయోధుడికిచ్చిన భూమిపై తప్పుడు నివేదిక ఇచ్చినందుకు గాను దేవాదుల డిప్యూటీ కలెక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. 2005-06 సంవత్సరాల్లో హయత్‌నగర్ మండల డిప్యూటీ తహశీల్దార్‌గా సముద్రాల రామచంద్రయ్య పనిచేశారు. మండలంలోని తుర్కయాంజల్ గ్రామం సర్వేనంబర్-52లోని పదెకరాల భూమిని బండారు లింగయ్య అనే స్వాతంత్య్ర సమరయోధునికి గతంలో ప్రభుత్వం కేటాయించింది.
అయితే, ఆ భూమిని లింగయ్య స్వాధీనం చేసుకోలేదు. ఆ మేరకు పొజిషన్‌లో లేనట్లు రికార్డులున్నాయి. అయితే, ఆయన పొజిషన్‌లో ఉన్నట్లు 2005లో రామచంద్రయ్య ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారుల విచారణలో తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లు తేలటంతో కలెక్టర్ ఉత్తర్వుల మేరకురామచంద్రయ్యఅరెస్టు చేశారు.