డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు | Deputy Collectors transfers | Sakshi
Sakshi News home page

డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

Feb 13 2014 1:10 AM | Updated on Aug 14 2018 4:32 PM

జిల్లాలో భారీ గా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఎన్నికల సంఘం ని బంధనల మేరకు కొం త మందికి స్థాన చల నంకలగగా..

  •      నర్సీపట్నం ఆర్డీవోగా సత్యశారదా దేవి
  •      యూఎల్‌సీ ఎస్‌ఓగా ఎల్.రమేష్‌గుప్తా
  •  విశాఖ రూరల్, న్యూ స్‌లైన్: జిల్లాలో భారీ గా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఎన్నికల సంఘం ని బంధనల మేరకు కొం త మందికి స్థాన చల నంకలగగా, గత కొద్ది కాలంగా ఖాళీగా ఉన్న స్థానాలను ప్రభుత్వం భర్తీ చేసింది. నర్సీపట్నం ఆర్డీవోగా హైదరాబాద్‌లో సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫీస్‌లో భూ భారతి డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఎం.సత్య శారదా దేవిని నియమించింది. అలాగే అర్బన్ ల్యాండ్ సీలింగ్(యూఎల్‌సీ) స్పెషల్ ఆఫీసర్‌గా రంగారెడ్డి జిల్లాలో పీఆర్ అండ్ ఆర్‌డీ జిల్లా విజిలెన్స్ ఆఫీసర్‌గా ఉన్న ఎల్.రమేష్‌గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    కొంత కాలంలో ఖాళీగా ఉన్న  విశాఖ స్టీల్‌ప్లాంట్ భూసేకరణ ఎస్‌డీసీగా కాకినాడలో కెఎస్‌ఈజెడ్ ఎస్‌డీసీగా ఉన్న ఎస్.మల్లిబాబు రానున్నారు. జిల్లాలో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీస్(ఎఫ్‌ఎస్‌వో) డిప్యూటీ కలెక్టర్ సీతామహాలక్ష్మికి కర్నూల్ జిల్లాలో రైల్వేస్ బీజీ కన్వర్షన్ భూసేకరణ ఎస్‌డీసీగా బదిలీ అయింది. ఇక్కడ ఎఫ్‌ఎస్‌వోగా తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం స్పెషల్ కలెక్టర్ పీఏగా ఉన్న ఎం.జ్యోతిని నియమించారు. జిల్లాలో కోనేరు రంగారావు కమిటీ(కేఆర్‌సీ) ఎస్‌డీసీ విజయసారధిని జ్యోతి స్థానంలో నియమించారు. కేఆర్‌సీ ఎస్‌డీసీగా ఏలూరులో డుమా ఏపీడీగా ఉన్న సి.హెచ్.వెంకటేశ్వరరావు రానున్నారు.

    హెచ్‌పీసీఎల్‌లో వీవీఎస్‌పీఎల్ కాంపిటెంట్ అథారిటీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఎస్.జె.మాధవి హైదరాబాద్ గ్రామీణాభివృద్ధి శాఖ విజిలెన్స్ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. ఈ స్థానంలో పెద్దాపురంలో పీఎల్‌ఐఎస్ యూనిట్-2 ఎస్‌డీసీ కె.పద్మ వస్తున్నారు. ఏపీఐఐసీ భూసేకరణ ఎస్‌డీసీగా ఉన్న పి.వి.ఎల్.నారాయణ తూర్పుగోదావరి జిల్లా ఏపీడీ(ల్యాండ్)గా స్థానచలనమైంది.

    కాకినాడ ఆర్డీవో జి.జవ హర్‌లాల్ నెహ్రూ జిల్లా సివిల్ డిఫెన్స్ కంటోన్మెంట్ డిప్యూటీ కంట్రోలర్‌గా నియమితులయ్యారు. డీఆర్‌డీఏ ఏపీడీ(ల్యాండ్) జి.సుజాత శ్రీకాకుళం డీఆర్‌డీఏ ఏపీడీ(ల్యాండ్)గా బదిలీ జరగగా అక్కడ ఉన్న కె.ధర్మారావు ఈమె స్థానంలోకి రానున్నారు. రాజమండ్రిలో గెయిల్ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఎన్.సుగుణకుమారిని యలమంచిలిలో ఐఎస్‌పీఎల్ యూనిట్-2 ఎస్‌డీసీగా నియమించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement