
కలెక్టర్ అనితారామచంద్రన్‌ను కలసి పుష్పగుచ్ఛం అందిస్తున్న సంతోషి
సాక్షి యాదాద్రి: భారత్–చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు భార్య సంతోషి యాదాద్రి జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. సోమవారం ఆమె కలెక్టర్ అనితారామచంద్రన్‌ను కలిశారు. జూన్ 21న ప్రభుత్వం ఆమెను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించిన విషయం విదితమే. ఉద్యోగ విధి విధానాలపై ఇప్పటి వరకు హైదరాబాద్‌లో మూడు నెలల శిక్షణ పొందిన సంతోషికి క్షేత్రస్థాయి శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటాయించారు. 2021 జనవరి 24 వరకు ఇక్కడ కలెక్టరేట్‌తో పాటు క్షేత్రస్థాయిలో విధులపై శిక్షణ పొందనున్నారు. (చదవండి: సయోధ్య దిశగా...)
Comments
Please login to add a commentAdd a comment