
చిక్కుల్లో చెంపపగులగొట్టిన ఎమ్మెల్యే
డిప్యూటీ కలెక్టర్పై చేయిచేసుకున్న ఎన్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సురేశ్ లాడ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదైంది.
ముంబయి: డిప్యూటీ కలెక్టర్పై చేయిచేసుకున్న ఎన్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సురేశ్ లాడ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదైంది. విధుల్లో ఉన్న ఓ అధికారిని బెదిరించడం, హింసకు దిగడం, విధులకు ఆటంకం కలిగించడం, అధికారిపై చేయిచేసుకోవడంవంటి ఆరోపణలు ఆయనపై నమోదు అయ్యాయి. ఓ ప్రాజెక్టుకు సంబంధించి రైతులకు నష్టపరిహారం ఇప్పించే విషయంలో మహారాష్ట్ర లోని రాయ్ గఢ్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ సమావేశం ఏర్పాటుచేశారు.
ఆ సమావేశానికి ఎన్సీపీ ఎమ్మెల్యే సురేశ్ లాడ్ కూడా వెళ్లారు. తమకు భూమే కావాలని అక్కడ రైతులు ఆందోళన చేసిన క్రమంలో సమావేశం రచ్చరచ్చగా మారింది. ఆ సమయంలోనే ఎమ్మెల్యే సురేశ్ డిప్యూటీ కలెక్టర్ మరో అధికారిని చొక్కాలు పట్టుకొని లాగి చేయిచేసుకున్నాడు. ఈ వీడియో బయటకు రావడంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తాయి. పైగా ఘటన జరిగి 24గంటలైనా కనీసం కేసు నమోదు చేయలేదని విమర్శలు వచ్చిన వెంటనే ఆయనపై కేసులు పెట్టారు.