
సాక్షి, అమరావతి : బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఇకపై డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. గురువారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీకాంత్, చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌కు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఉత్తర్వులను సీఎం అందించారు. పద్మశ్రీ అవార్డు సాధించడం పట్ల శ్రీకాంత్‌ను అభినందించిన చంద్రబాబు భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు.
Congratulated @srikidambi on being awarded with Padma Shri award and gave him posting orders to take charge as a Deputy Collector. Extended warm wishes to his mentor Sri. Pullela Gopichand as well. pic.twitter.com/spmAEgwjFL
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2018