నకిలీ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు | deputy collector | Sakshi
Sakshi News home page

నకిలీ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు

Published Thu, Jul 2 2015 1:52 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

deputy collector

జలదంకి: డిప్యూటీ కలెక్టర్‌నంటూ మోసానికి పాల్పడిన వ్యక్తి, అతనికి సహకరించిన ఇద్దరి గుట్టును పోలీసులు రట్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఎస్సై క్రిష్ణబాబు కథనం మేరకు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్న మెగలాల ప్రసాద్, ఉదయగిరి ట్రెజరీలో పని చేస్తున్న కిషోర్‌కుమార్, ప్రభాకర్ అనే మరో వ్యక్తి జూన్ 14న తిమ్మసముద్రం ఆరోగ్య కేంద్రానికి ఎంతో మేలు చేస్తున్న వానపాములను కొంతమం ది అక్రమార్కులు తీర ప్రాంత గ్రామాల్లోని కూలీ లను ప్రోత్సహించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
 
 వానపాములు తీసేందుకు తవ్వకాలు చేస్తుండటంతో సరస్సు ఉనికిని కోల్పోయే ప్రమా దం వుంది. సున్నపుగుల్ల కోసం తవ్వకాలు చేస్తున్న వారే గత మూడేళ్లుగా వానపాముల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. ముఖ్యంగా తడ మండ లం వేనాడు, ఇరకం దీవులకు చుట్టూరా వానపాముల తవ్వకాలు ఒక పరిశ్రమలాగా తయారైంది.
 
 వేనాడు, ఇరకం దీవులే కేంద్రాలు
 వేనాడు, ఇరకం దీవుల కూలీలు ఎక్కువగా వానపాములను పట్టే పనికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. తవ్వి తీసిన వానపాములను మట్టికుండలు, ప్లాస్టిక్ బక్కెట్లు ద్వారా, పాలిథిన్ కవర్లలో అనుమానం రాకుండా తరలిస్తున్నారు. ఒక భార్యాభర్త నాలుగైదు గంటలు పనిచేసి వానపాములు పడితే సుమారు రూ. 1,500 వస్తుండడంతో ఈ రెండు దీవుల్లోని గిరిజన కూలీలు ఇబ్బడిముబ్బడిగా వానపాముల తవ్వకాలకు వెళ్తున్నారు. పులికాట్ సరస్సులో దొరికే వానపాములకు రొయ్యల హేచరీల్లో మంచి డిమాండ్ వుండడంతో చాలామంది ఈ అక్రమ వ్యాపారాన్ని చేస్తున్నారు.
 
 కిలో వానపాములు పడితే కూలీకి రూ.500 నుంచి రూ.750 ఇస్తున్నారు. వీటిని హేచరీలకు తరలించి విక్రయిస్తే సైజును బట్టి  కిలోకు సుమారుగా రూ. 3 వేలు నుంచి రూ. 6 వేలు వస్తోంది. వానపాములను జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలో ఉన్న హేచరీలకు తరలించి విక్రయిస్తున్నారు. సూళ్లూరుపేట, తడ, తమిళనాడులోని పలు ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లు కూలీలను ప్రోత్సహించి ఈ పని చేయి స్తూ లక్షలు గడిస్తున్నారు.
 
 గతంలో ఆటోల్లో, బైక్‌లపై తరలించే స్థాయి నుంచి ఇప్పుడు ఖరీదైన కార్లులో అనుమానం రాకుండా తరలిస్తున్నారు. ఇటీవల  తడ, కావలి వద్ద కారుల్లో తరలిస్తున్న వానపాములను పట్టుకున్నారు. దీనిని బట్టి చూస్తే అక్రమ రవాణా ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా వానపాములు ఇబ్బడిముబ్బడిగా తీసేయడం వల్ల సరస్సులో గుల్ల తేలిపోవడమే కాకుండా మత్స్య సంపద కూడా భారీగా తగ్గిపోయే ప్రమాదం వుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది పులికాట్ సరస్సులో రొయ్యలు, చేపలు, పీతల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది.
 
 ఎలా తీస్తారంటే...: సరస్సులో నీళ్లు లేకుండా అడుసుగా వున్న ప్రాంతాన్ని ఎన్నుకుంటారు. ఒక మీటరు నుంచి రెండు మీటర్లు వ్యాసార్థాన్ని చూసుకొని చుట్టురా కాళ్లతో బాగా లోతుగా తొక్కుతూ వస్తారు. ఈ రెండు మీటర్లు వ్యాసార్థంలో మట్టి అంతా ఒక దగ్గరకు చేరుతుంది. వెంటనే పోగుగా పడిన మట్టిని తీసి పక్కకు నెట్టగానే దానికింద ఐదు నుంచి ఏడు కిలోలు వానపాములు దాకా దొరుకుతాయి.
 
 దాడులు శూన్యం : ఇంత జరుగుతున్నా పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం అధికారులు దాడులు చేస్తున్న దాఖలాలు లేవు. అందిన కాడికి దండుకుని కార్యాలయానికి పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. దీంతో వానపాముల తవ్వకాలు ఇబ్బడిముబ్బడిగా జరుగుతూనే ఉన్నాయి. కొందరు యథేచ్ఛగా వానపాములను తవ్వేస్తుండటాన్ని పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారే గాని వారికి అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టడం లేదు. వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాల్సిన అవసరముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement