
ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన పీవీ సింధు
- డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
విజయవాడ: బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగినిగా బాధ్యతలు స్వీకరించారు.
విజయవాడ సిటీలోని గొల్లపూడిలో గల ఆంధ్రప్రదేశ్ భూపరిపాలన(సీసీఎల్‌ఏ) కమిషనర్ కార్యాలయానికి వచ్చిన సింధు.. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంలో చేరుతున్నట్లు సీసీఎల్‌ఏ ప్రధాన కమిషనర్ పునేఠాకు రిపోర్ట్ చేశారు.
అయితే, ఆమెకు ఎలాంటి పనులు అప్పగిస్తారనేది ఇంకా తెలియాల్సిఉంది. కొద్దిరోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశంఉంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభకనబర్చిన సింధు.. బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకం సాధించారు. అందుకుగానూ ఆమెను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించింది. ఇటీవల సింధూను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియామక పత్రాన్ని అందజేశారు. మంచిరోజు కావడంతో నేడు సింధు విధుల్లోకి చేరారు.