నేటి నుంచి నష్టం అంచనా
- ఎన్యూమరేషన్‌కు 176 బృందాలు
- జోనల్ ఆఫీసర్లుగా ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, డిప్యూటీ కలెక్టర్లు
- ఒక్కొక్కరికి ఆరు వార్డులు/ మండలం బాధ్యత
- వీరిపై పర్యవేక్షణకు ఏడుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు
విశాఖ రూరల్: హుదూద్ తుపాను నష్టం అంచనా గురువారం నుంచి చేపడుతున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని యంత్రాంగం భావి స్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా 176 బృందాలను ఏర్పాటు చేసింది. నష్టం అంచనా నిష్పక్షపాతంగా జరిగేందుకు ఇతర జిల్లాల అధికారులతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులుండే వీటిల్లో స్థానిక తహశీల్దార్, వీఆర్వో కూడా ఉంటారు. పం టలు, గృహాలు, మరణాలతో పాటు ఇతర నష్టాలను గురువారం నుంచి ఈ బృందాలు వారికి కేటాయించిన మండలాలు, వార్డుల్లో సర్వే చేయనున్నాయి.
జోనల్ అధికారులుగా ఐఏఎస్‌లు
ఈ 176 బృందాల పనితీరును పరిశీలించేందుకు జోన ల్ అధికారులుగా 35 మంది ఐఏఎస్‌లను నియమిం చారు. వీరితో పాటు ఐఎఫ్‌ఎస్, డిప్యూటీ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు కూడా ఆ బాధ్యతలను అప్పగించా రు. ఒక్కో జోనల్ అధికారికి జీవీఎంసీ పరిధిలో అయితే ఆరు వార్డులు, గ్రామీణ ప్రాంతంలో అయితే ఒక మం డలాన్ని కేటాయించారు.
జీవీఎంసీ పరిధిలో 24 వార్డులను లేదా రూరల్‌లో ఏడు మండలాలను కలిపి ఒక జోన్‌గా విభజించారు. ఒక్కో జోన్‌లో నష్టం అంచనాల పర్యవేక్షణకు ఏడుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల ను నియమించారు. ఎల్.వి.సుబ్రహ్మణ్యం, శ్యాంబా బు, అనిల్‌చంద్రపునీఠా, మన్మోహన్‌సింగ్, చొత్రాయ్, ఉషారాణి, కృష్ణయ్య(రిటైర్డ్)లు ఎన్యూమరేషన్‌ను పర్యవేక్షించనున్నారు.
వారం రోజుల్లో పూర్తి
నష్టం అంచనాలను వారం రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాప్యం జరిగే కొద్దీ బాధితులు మరింత నష్టపోతారని భావిస్తున్నారు.గత ఏడాది తుఫాన్ నష్టాలకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. అంచనాల రూపల్పనకు జాప్యంవల్లే ఇలా జరిగిందని అధికారుల మాట. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకుండా బాధితులకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర బృందం వచ్చేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఆ అంచనాలను కేంద్రం ముందుంచి భారీగా పరిహారాన్ని రాబట్టాలని యోచిస్తున్నారు.