డిప్యూటీ కలెక్టరుగా పీవీ సింధు
నియామకానికి ఏపీపీఎస్సీ ఆమోదం
సాక్షి, అమరావతి: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్‌లో దేశానికి రజతం సాధించి పెట్టిన తెలుగమ్మాయి పీవీ సింధును డిప్యూటీ కలెక్టరుగా నియమిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గురువారం ఆమోదం తెలిపింది. చైర్మన్ ఉదయభాస్కర్ అధ్యక్షతన గురువా రం జరిగిన ఏపీపీఎస్సీ పాలక మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చిం చి ఆమోద ముద్ర వేశారు. వెంటనే ప్రభుత్వానికి సంబంధిత ఫైల్‌ను పంపించారు. ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో దీనిపై నియామక ఉత్తర్వులు ఇవ్వనుంది.