సాక్షి, అమరావతి: భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఖాయమైంది. అతనికి ఈ ఉద్యోగం ఇవ్వడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగుల నియామకం, నియంత్రణ, వేతన చట్టం–1999ను సవరించారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బిల్లును శనివారం శాసనసభ ఆమోదించినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.
గుంటూరుకు చెందిన శ్రీకాంత్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ నెలలో దుబాయ్‌లో జరగనున్న సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు కూడా అతను అర్హత సాధించాడు.
షట్లర్ శ్రీకాంత్ ఇక డిప్యూటీ కలెక్టర్!
Published Sun, Dec 3 2017 1:11 AM | Last Updated on Sun, Dec 3 2017 1:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment