రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..! | MP Farmers Daughter Failed Class 11 Now Appointed Deputy Collector, Know About Her Story In Telugu | Sakshi
Sakshi News home page

రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..! ఇంటర్‌ ఫెయిల్‌ అవ్వడమే..!

Published Sun, Jun 9 2024 3:41 PM | Last Updated on Sun, Jun 9 2024 6:39 PM

MP Farmers Daughter Failed Class 11 Now Appointed Deputy Collector

ఓ సాధారణ రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌ అయ్యి తన సొంత రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తుంటే ఆ ఆనందం మాటలకందనిది. చిన్నప్పుడూ అందరిలా సాధారణంగా చదివే అమ్మాయి అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందింది. ఇంటర్‌ ఫెయిల్‌ అవ్వడంతోనే ఆమె లైఫ్‌ టర్న్‌ తిరిగింది. ఆ ఓటమి ఆమెలో కసిని పెంచి ఈ స్థాయికి చేరుకునేలా చేసింది. ఆమె విజయగాథ ఏంటంటే..

ఆమె పేరు ప్రియాల్‌ యాదవ్‌. ఇండోర్‌కి చెందిన వ్యవసాయం కుటుంబ నేపథ్యం. తండ్రి రైతు, తల్లి గృహిణి. ఆమె చిన్నప్పుడూ అందిదిలా సాధారణ విద్యార్థే. బాగా చదివే విద్యార్థి మాత్రం కాదు. ఏదో పరీక్షల ముందు చదివి పాసైపోయామా.. అన్నట్లుగానే చదివేది. అయితే ఇంటర్మీడియెట్‌లో దారుణంగా ఫెయిల్‌ అయిపోవడం ఆమెను బాగా డిప్రెషన్‌కు గురి చేసింది. అదే ఆమెను బాగా కష్టపడి చదివేలా చేసింది. ఆ వైఫల్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరావృతం కాకూడదని గట్టిగా నియించుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినా.. ప్రియాల్‌ తన తోటి వాళ్లందరూ డిగ్రీ వరకు చదవుకుని పెళ్లిళ్లు చేసేసుకుని వెళ్లిపోయినా..తాను మాత్రం బాగా చదివి ఆఫీసర్‌ స్థాయిలో ఉండే ఉద్యోగ్నాన్ని పొందాలని ప్రగాఢంగా కోరుకుంది.

అందుకే మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ (ఎంపీపీఎస్‌సీ) పరీక్షలో ఒకటి, రెండుసార్లు కాదు ఏకంగా మూడుసార్లు పాసయ్యింది. 2019లో తొలిసారిగా మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌(ఎంపీపీఎస్‌సీ) రాసినప్పుడూ..జిల్లా రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత 2020లో రెండో ప్రయత్నంలో 34వ ర్యాంక్‌ను సాధించి సహకార శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఇక చివరి ప్రయత్నంలో తన ర్యాంకు మరింత మెరుగుపడింది. ఏకంగా ఆరో ర్యాంకు సాధించి..  తన సొంత రాష్ట్రానికే డిప్యూటి కలెక్టర్‌ నియమితురాలయ్యింది. 

తనను ఆ ఓటమి నీడలా వెంటాడి భయపెట్టిందని, అది మళ్లీ జీవితంలో అస్సలు రాకూడదన్న కసి ఈ స్థాయికి వచ్చేలా చేసిందని చెప్పుకొచ్చింది ప్రియాల్‌. అక్కడితో ఆమె విజయం ఆగిపోలేదు..ఐఏఎస్‌ కావలన్నది ఆమె తదుపరి లక్ష్యం. ప్రియాల్ యాదవ్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) పరీక్షలలో విజయం సాధించి ఐఏఎస్‌ అధికారి కావాలనే  లక్ష్యంపై దృష్టిసారించింది. తాను డిప్యూటీ కలెక్టర్‌ పనిచేస్తూనే ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతానని అంటోంది ప్రియాల్‌. ప్రస్తుతం ఆమె ఇండోర్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తుంది. విజయానికి ముగింపు లేదు అనడానికి ప్రియాల్‌ ఒక ఉదాహరణ కదూ. ఓటమితో కుంగిపోకుండా..దాన్నే తన కెరీర్‌ని మంచిగా నిర్మించుకోవడానికి పునిదిగా చేసుకుని సక్సెస్‌కి మారుపేరుగా నిలిచింది.  అందరి చేత శెభాష్‌ ప్రియాల్‌  అని అనిపించుకుంది. 

(చదవండి: ప్రపంచంలో ఎన్ని రకాల బంగాళా దుంపలు ఉన్నాయో తెలుసా..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement